తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను అనుసరించి నవంబర్ 8వ తేదీ వరకు అసెంబ్లీ చుట్టుపక్కల నాలుగు కిలో మీటర్ల మేరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు నవంబర్ 2 ఉదయం 6 గంటల నుంచి 8వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు అమలులో ఉంటాయన్నారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యల తప్పవని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.