Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు.
KCR Speech in Kollapur: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమం ముగించుకున్న అనంతరం ఇవాళ సాయంత్రం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కొల్లాపూర్ నియోజకవర్గంపై పలు ప్రత్యేక వరాలు గుప్పించారు.
CM KCR Speech from Kollapur: తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను పాలమూరుకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంత వాసులతో మాట్లాడుతూ, రాష్ట్రం వస్తేనే మనల్ని పట్టి పీడిస్తున్న సకల దరిద్రలు విడిచిపెడతాయని అన్నానని.. మన రాష్ట్రం మనకు వస్తేనే మన హక్కులు, మన నీళ్లు మనకు దక్కుతాయని చెప్పానని గుర్తుచేసుకున్నారు.
CM KCR at Palamuru project: పాలమూరు ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్విఛాన్ చేసి వెట్ రన్ ప్రారంభించారు. పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ స్విఛాన్ చేయడంతో మహా బాహుబలి మోటార్లు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించాయి.
Palamuru Project Narlapur Pump House Inauguration: పాలమూరు ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లా దశ, దిశను మార్చే ప్రాజెక్టు కానుందని.. దశలవారీగా పాలమూరు ఎత్తిపోతల పథకం పంపులను ప్రారంభిస్తూ పాలమూరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలంగాణ సర్కారు ప్రకటించింది.
Palamuru - Rangareddy Lift Irrigation Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి వారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం అని సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.