Allu Arjun Sandhya Theater Issue: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో చేసిన చిత్రం పుష్ప2. డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా నాల్గవ తేదీనే బెనిఫిట్ షో వేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో ఈ సినిమా విడుదలై 15 రోజుల్లోనే రూ .1500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఇక సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించుకుంటూ రావడం పై తొక్కేసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ ఇప్పుడిప్పుడే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై నిన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ దే తప్పు అన్నట్టు పూర్తిగా ఆయన మాట్లాడేసారు. ఒకరకంగా ఆయన చెప్పిన మాటల్లో కూడా నిజం ఉందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఒక ప్రాణం పోయినా పరామర్శించడానికి రాని సినిమా ఇండస్ట్రీ , ఒక హీరో అరెస్టయ్యాడనే సరికి యావత్ ఇండస్ట్రీ కదలి రావడం ఇక్కడ సంచలనంగా మారింది.
ఇకపోతే ఇప్పుడు ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా స్పందించారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటన సినీ హీరో అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదు కేవలం ఒక సినీ నటుడిగా మాత్రమే ఆయన థియేటర్ వద్దకు వెళ్లారన్నారు. మిగతా వారిని అరెస్టు చేయకుండా అల్లు అర్జున్ ని మాత్రమే అరెస్టు చేస్తే కరెక్ట్ కాదు అంటూ ఆమె తెలిపారు.
అలాగే జమిలి ఎన్నికలపై కూడా ఆమె మాట్లాడారు
జమిలి ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. జమిలీ ఎన్నికలు అనేవి ఒక పార్టీ ప్రవేశపెట్టి అమలు చేసేవి కాదు. దానిపై అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. చర్చలు అనంతరమే మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపింది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.