శ్రీదేవి మరణం అందరి కంటే ఇన్సూరెన్స్ కంపెనీకి బాధ కల్గిస్తోంది. ఎందుకంటే ఆమె పేరిట రూ.100 కోట్ల జీవిత బీమా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం పోలీసుల విచారణలో బోనీ కపూర్ వెల్లడించారు. అయితే ఇప్పటి ఇన్సురెన్స్ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా ఆమె భౌతికకాయాన్ని ఎప్పుడు ముంబైకి తీసుకోస్తారా ? అని ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
శ్రీదేవి మృతి కేసులో దుబాయ్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న ప్రాసిక్యూషన్ ... తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆస్తి తగదాలపై ఆరా తీసినట్లు తెలిసింది. దుబాయ్ మీడియా కథనాల ప్రకారం.. మోహిత్ పెళ్లిలో బోనీ కపూర్ మొదటి భార్య బంధువులు శ్రీదేవిని ఏకాకి చేశారు. ఆస్తి విషయంలో బోనీ కపూర్ కూడా మొదటి భార్య కుమారుడి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీదేవి ..హోటల్ గది నుంచి బయటకు రాలేదు. ఇదే సందర్భంగా ఆమె మరణించడం చర్చ నీయంశంగా మారింది. శ్రీదేవి మనస్తాపానికి ఆత్మహత్యకు పాల్పడిందా..
డెత్ సర్టిఫికేట్ రిపోర్టుతో శ్రీదేవి కేసు దర్యాప్తు ముందుకు కదులుతున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు గుండెపోటుతో మరణించారని భావిస్తువచ్చాం.. డెత్ సర్టిఫికేట్ రిపోర్టులో ఆమె ప్రమాద వశాస్తూ ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి మృతి చెందరాని పేర్కొనడంతో ఈ కేసు మలుపు తిరిగింది. ఈ రిపోస్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చింది డెత్ సర్టిఫికేట్ కు సంబంధించిన ప్రాధమిక సమచారం మాత్రమే. పూర్తి స్థాయిలో రిపోర్టు వస్తే కానీ దుబాయ్ పోలీసులు ఓ అంచనాకు రాలేని పరిస్థితి. దీంతో శ్రీదేవీ డెత్ సర్టిఫికేట్ పూర్తి స్థాయి రిపోర్టు పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
శ్రీదేవి డెత్ సరిఫికెట్ లో ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూంలో పడి చనిపోయిందని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఆమె గుండెపోటుతో మరణించిందని భావించారు..అయితే తాజా నివేదికతో శ్రీదేవి మరణంపై కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. డెత్ రిపోర్టుతో ఈ కేసును మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.
శ్రీదేవి గుండెపోటుతో మరిణించిందని ఎందుకు చెప్పినట్లు..? ఆమె బాత్ రూం వాష్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేదంటే ఎవరైనా తోశారా ? లేదంటే మద్యం మత్తులో జరిగిందా అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమౌతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.