Airtel Best Recharge Plan: ప్రతి నెలా ఎందుకు, ఏడాదికొక్కసారే రీఛార్జ్, ప్రయోజనాలివీ

Airtel Best Recharge Plan: భారత టెలీకం రంగంలో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన సంస్థల్లో ఒకటి ఎయిర్‌టెల్. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి కొత్త ప్లాన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2023, 04:03 PM IST
Airtel Best Recharge Plan: ప్రతి నెలా ఎందుకు, ఏడాదికొక్కసారే రీఛార్జ్, ప్రయోజనాలివీ

Airtel Best Recharge Plan: ప్రీ పెయిడ్ కస్టమర్లకు అంతా బాగానే ఉన్నా ఓ చికాకు ఎప్పటికీ ఉంటుంది. కొన్ని ప్లాన్స్ 28 రోజులు, కొన్ని 30 రోజులు, మరికొన్ని 54 లేదా 84 రోజులు ఇలా ఉంటుంటాయి. గుర్తు పెట్టుకుని మరీ సకాలంలో రీఛార్జ్ చేయించుకోవల్సి వస్తుంటుంది. ఇప్పుడిక ఈ సమస్య ఉండదు.

ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకుంటూ విసిగిపోతుంటే చక్కని పరిష్కారం ఉంది. ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ కస్టమర్ అయుండి..నెల నెలా రీఛార్జ్ బాధపడకుండా ఉండాలంటే మంచి అవకాశం ఎయిర్‌టెల్ కల్పిస్తోంది. ఈ ప్లాన్ నిజంగానే అద్భుతమైన ప్లాన్ కానుంది. ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకోవల్సిన అవసరం లేదు. ఇక ఎయిర్‌టెల్ ఏడాది ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ కాల పరిమితి 365 రోజులుంటుంది. ఈ ప్లాన్ తీసుకుంటే నెలనెలా రీఛార్జ్ బెడద తప్పడమే కాకుండా చాలా లాభాలున్నాయి. ఎయిర్‌టెల్ 365 డేస్ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే నెల నెలా చేయించుకునే రీఛార్జ్ కంటే తక్కువ ఖర్చవుతుంది.

ఎయిర్ టెల్ 365 డేస్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఎయిర్‌టెల్ అధికారిక యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 100 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్లాన్ ఖరీదు 2023 రూపాయలు. ఏడాది పాటు వర్తిస్తుంది. పూర్తిగా ఏడాది ఏ విధమైన రీఛార్జ్ చేయించాల్సిన అవసరముండదు. నెల నెలా లేదా 54 రోజులు లేదా 84 రోజుల ప్లాన్స్‌తో పోల్చుకుంటే ఏడాది 365 డేస్ ప్లాన్ చౌకగా ఉంటుంది.

Also read: Hyundai Exter SUV Launch: అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో హ్యుండయ్ Exter SUV, బుకింగ్స్ ప్రారంభం, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News