iPhone 16 Leak: ఐఫోన్ 16 డిజైన్, ఫీచర్లు లీక్, ఐఫోన్ 15ను తలదన్నే ప్రత్యేకతలు, లాంచ్ ఎప్పుడంటే

iPhone 16 Leak: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ మార్కెట్‌లో త్వరలో రానున్న ఐఫోన్ 16 ఫీచర్లు లీకయ్యాయి. అద్భుతమైన డిజైన్, స్పెసిఫికేషన్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. డిజైన్ ఐఫోన్ 15 కంటే అదిరిపోయిందంటున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2024, 08:22 AM IST
iPhone 16 Leak: ఐఫోన్ 16 డిజైన్, ఫీచర్లు లీక్, ఐఫోన్ 15ను తలదన్నే ప్రత్యేకతలు, లాంచ్ ఎప్పుడంటే

iPhone 16 Leak: ఆపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 లాంచింగ్‌కు సిద్దమౌతోంది. ప్రతి యేటా సెప్టెంబర్ నెలలో ఐఫోన్ సిరీస్ లాంచ్ అవుతుంటుంది. గత ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్రస్తుతం మార్కెట్‌లో ఉంది. అప్పుడే ఐఫోన్ 16 డిజైన్, ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ 15 కంటే అన్ని విధాలుగా మెరుగైందిగా ఉండవచ్చని తెలుస్తోంది. 

టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త మోడల్ ఫోన్ ఐఫోన్ 16 లాంచ్ మరో నాలుగు నెలల్లో ఉంది. ఈలోగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫీచర్లు, ధర, డిజైన్ వంటి వివరాలు బయటికొచ్చాయి. డిజైన్ విషయంలో ఐఫోన్ 15 ఉన్నట్టే ఉంటుందని తెలుస్తోంది. కొత్తగా వర్టికల్ కెమేరా లే అవుట్ కన్పిస్తుంది. వీడియా రికార్డింగ్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండింట్లోనూ పిల్ ఆకారంలో కెమేరా బంప్ ఉంటుంది. ప్రత్యేక వైడ్, అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ఇక యాక్షన్, క్యాప్చర్ బటన్‌లో మార్పు ఉంటుంది. ఫ్లాష్ లైట్ వంటి షార్ట్ కట్స్ ఉంటాయి. క్యాప్చర్ బటన్ సహాయంతో ఫోటోలు, వీడియోలు మరింత క్లారిటీగా, అద్బుతంగా వస్తాయి. జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనుభవం బాగుంటుంది. 

iPhone 16లో కొత్తగా  N3E నానోమీటర్ నోడ్తో A18 చిప్‌సెట్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఐఫోన్ల కంటే అద్భుతమైన పనితీరు ఉంటుంది. ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. మైక్రో టెక్నాలజీ కలిగిన ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంటుంది. ఇందులో ఉండే ఆపిల్ బోర్డర్ రిడక్షన్ స్ట్రక్చర్ కారణంగా డిస్‌ప్లే మరింత స్పష్టంగా ఉంటుంది. 

ఐఫోన్ 16 ఫోన్ ఎప్పటిలానే సెప్టెంబర్ నెలల లాంచ్ కావచ్చు. సెప్టెంబర్ 12-15 తేదీల్లో లాంచ్ చేసి 22వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభించవచ్చని అంచనా. ఐఫోన్ 16 ప్రో ధర 1 లక్షా 20 వేలు ఉండవచ్చని అంచనా. బేసిక్ మోడల్ ఐఫోన్ 16 అయితే 79 వేల వరకూ ఉండవచ్చు.

Also read: Best Compact SUV: ఈ 5 కాంపాక్ట్ SUV కార్లలో ఏది బెస్ట్, ఎంత మైలేజ్ ఇస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News