Drop Samsung Galaxy M04 Price: అమెజాన్‌ బంఫర్‌ ఆఫర్‌..Samsung Galaxy M04 మొబైల్‌పై రూ. 5,950 డిస్కౌంట్..

Drop Samsung Galaxy M04 Price: అమెజాన్‌లో  Galaxy M04 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఫిబ్రవరి 14 దృష్టిలో పెట్టుకొని ఆమెజాన్ ఈ మొబైల్‌పై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 10:30 AM IST
Drop Samsung Galaxy M04 Price: అమెజాన్‌ బంఫర్‌ ఆఫర్‌..Samsung Galaxy M04 మొబైల్‌పై రూ. 5,950 డిస్కౌంట్..

Drop Samsung Galaxy M04 Price: అమెజాన్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా 10 వేల లోపు లభించే మల్టీ నేషనల్ టెక్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్‌పై దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. 10 వేల లోపే ప్రీమియం ఫీచర్లతో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా సాంసంగ్ గత సంవత్సరంలో లాంచ్‌ చేసిన Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాంసంగ్ కంపెనీ ఈ Galaxy M04 స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో మొదటి వేరియంట్ 64జిబి ఇంటర్నల్ మెమొరీని కలిగి ఉంటే.. ఇక రెండవ వేరియంట్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ. 11,999 కాగా.. వాలెంటైన్స్ డే స్పెషల్ డీల్‌లో భాగంగా 48 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,299కే లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు:
ఈ Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో పొందడానికి వన్ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా బిల్ చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లిస్తే దాదాపు రూ. 350 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్, HSBC బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా తగ్గింపు పొందవచ్చు. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ వివరాల్లోకి వెళితే.. ఎక్స్చేంజ్ బోనస్ పొందడానికి మీరు వినియోగిస్తున్న కండిషన్‌లో ఉన్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది.  

ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 5,950 వరకు డిస్కౌంట్ బోనస్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ బోనస్‌ను వినియోగించి Galaxy M04 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1,500లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆమెజాన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News