Bumper Offer: అమెజాన్‌లో Nord CE సిరీస్‌ మొబైల్స్‌పై భారీ తగ్గింపు..కేవలం రూ.3,999లోపే పొందండి!

Drop OnePlus Nord CE 3 Lite 5G, Nord CE 3 5G Price: అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ Nord CE 3 Lite 5G, Nord CE 3 5G స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 12:00 PM IST
Bumper Offer: అమెజాన్‌లో Nord CE సిరీస్‌ మొబైల్స్‌పై భారీ తగ్గింపు..కేవలం రూ.3,999లోపే పొందండి!

 

Drop OnePlus Nord CE 3 Lite 5G, Nord CE 3 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ Amazon ప్రతి వారం ప్రత్యేక డీల్‌ను నిర్వహింస్తుంది. టాప్ డీల్స్ ఆఫ్ ది వీక్‌ అనే పేరుతో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ని అతి తక్కువ ధరలకే అందిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్‌ భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా Nord సిరీస్‌లకు సంబంధించిన వన్‌ప్లస్‌ Nord CE 3 Lite 5G, Nord CE 3 5G స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక కూపన్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు అమెజాన్‌ ఈ మొబైస్స్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్స్‌ను ఏయే ఆఫర్స్‌ వినియోగించి అతి చౌకగా పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

OnePlus Nord CE 3 Lite 5G డిస్కౌంట్‌ వివరాలు:
అమెజాన్‌లో 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్‌ ధర రూ.19,999లతో అందుబాటులో ఉంది. అయితే ఈ అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక టాప్‌ డీల్స్‌లో భాగంగా ఈ మొబైల్‌పై రూ.1,000 వరకు విలువ కలిగిన తగ్గింపు కూపన్ కూడా పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్‌ అనుసంధాన బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1500 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై రూ.18,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. ఇలా అన్ని ఆఫర్స్‌ పోను కేవలం రూ.2,000లోపే పొందవచ్చు.  

ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో 108-మెగాపిక్సెల్ బ్యాక్‌ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా ఇది 5000mAh బ్యాటరీ, 67 వాట్ సూపర్‌ ఫుల్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్‌ చేసి రోజంతా నాన్‌ స్టాప్‌గా వినియోగించవచ్చు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

OnePlus Nord CE 3 5G:
అమెజాన్‌లోని టాప్ డీల్స్ ఆఫ్ ది వీక్‌లో భాగంగా OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్‌పై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ.24,999 కాగా ఈ డీల్‌లో భాగంగా  రూ.1,000 కూపన్ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా ఈ మొబైల్‌పై రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మరింత తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.21,000 వరకు ఎక్చేంజ్‌ భోనస్‌ కూడా పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.3,999 వరకు తగ్గింపు పొందవచ్చు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News