Great Indian Sale 2023 Date: ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో పండగ సేల్ ప్రారంభం కాబోతోంది. ప్రతి సంవత్సరం అమెజాన్ నిర్వహించే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2023ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు అధికారిక సమాచారం..అయితే ఫ్లిఫ్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ 2023కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెళ్లడించడంతో అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ సేల్‌పై ముందడుగు వేసింది. ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులను భారీ తగ్గింపుతో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సేల్‌కి సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీడియా నివేదికల ప్రకారం..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై భారీ తగ్గింపును అందిచబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా సేల్‌లో ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు, ఆకర్శనీమైన ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిచబోతోంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన నేషనల్ బ్రాండ్‌లపై నోకాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా ఈ సేల్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇక ఈ సేల్‌లో యాపిల్ కంపెనీ ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిచబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అమెజాన్ ఇప్పటికీ తేదీ, ఇతర డిస్కౌంట్ ఆఫర్‌ల గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్టోబర్ 11 నుంచి ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అధికారిక సమాచారం. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారి ఈ సేల్ అక్టోబర్ 10 నుంచే మొదలవుతుంది. అయితే ఈ సేల్‌లో అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ భారీ తగ్గింపు లభించున్నాయి.
ఈ వస్తువులపై భారీ తగ్గింపు:
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2023లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులపై భారీ తగ్గింపులను అందించే అవకాశం ఉంది. ఈ సేల్‌లో Apple iPhone, Samsung Galaxy, ఒప్పో, వీవో, మల్టీ నేషనల్ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్, ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపుతో పాటు బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచబోతోంది. అంతేకాకుండా అమెజాన్‌లో లభించే ప్రతి వస్తువును 50 శాతంకు పైగా తగ్గింపును అందించబోతోంది. అయితే ఈ సేల్‌కి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి