Honor X9B 5G Price Down: ఇది మాములు డిస్కౌంట్‌ కాదు..అమెజాన్‌లో Honor X9B 5Gపై ఏకంగా రూ.24,699 తగ్గింపు!

Honor X9B 5G Price Down: అతి తక్కువ ధరలోనే Honor X9b 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్ ఈ మొబైల్‌పై ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 10:42 AM IST
Honor X9B 5G Price Down: ఇది మాములు డిస్కౌంట్‌ కాదు..అమెజాన్‌లో Honor X9B 5Gపై ఏకంగా రూ.24,699 తగ్గింపు!

Honor X9B 5G Price Down: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మార్కెట్‌లో ఇటీవలే విడుదలైన స్మార్ట్‌ఫోన్స్‌పై ఈ ప్రత్యేక డీల్స్‌లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. చైనీస్ టెక్ బ్రాండ్ హానర్ గత వారం లాంచ్‌ చేసిన Honor X9b 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్‌ ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ Honor X9b 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో రూ.30,999తో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా 16 శాతం తగ్గింపుతో రూ.25,999తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ కేవలం ఒక వేరియంట్‌లోనే లభిస్తోంది. అలాగే అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ రూ.3,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

దీంతో పాటు ICICI, Axis క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 22,999కే పొందవచ్చు. దీంతో పాటు మరింత తగ్గింపు పొందడానికి అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్ కూడా లభిస్తోంది. ఇలా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.24,699 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఫీచర్స్, స్పెఫికేషన్స్‌ వివరాలు:
డిస్ప్లే:

6.78 అంగుళాల పెద్ద AMOLED కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే
1200 x 2652 పిక్సెల్‌ల గరిష్ట రిజల్యూషన్
1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్
120Hz రిఫ్రెష్ రేట్

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

కెమెరా:
108 MP + 5 MP + 2 MP సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
16 MP సెల్ఫీ కెమెరా

పనితీరు:
లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 6 జన్ 1 (4nm) చిప్‌సెట్
Octa-Core CPU (4 x 2.2 GHz A78 మరియు 4 x 1.8 GHz Kryo A55)
8GB ర్యామ్, 256GB స్టోరేజీ

బ్యాటరీ:
5000 mAh పెద్ద బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇతర ఫీచర్లు:

5G కనెక్టివిటీ:
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ డిస్ప్లే (ఫోన్ పడిపోయినప్పుడు స్క్రీన్‌ను రక్షిస్తుంది)
3.5mm హెడ్‌ఫోన్ జాక్

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News