Oppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశం

Smartphone Offers: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్ అంటే ఇష్టం లేనివారుండరు. ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుుడ ఐఫోన్‌ను తలదన్నే ఫీచర్లతో అద్భుతమైన సూపర్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో కంపెనీ లాంచ్ చేసిన ఈ ఫోన్ ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2024, 07:23 PM IST
Oppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశం

Smartphone Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అదే విధంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్‌ను తలదన్నే ఫీచర్లతో లాంచ్ అయిన ఒప్పో లేటెస్ట్ మోడల్ ఫోన్‌పై కూడా డిస్కౌంట్ లభిస్తోంది. 

Oppo A59 స్మార్ట్‌ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో అద్భుతమైన క్లారిటీ ఉంటుంది. 720/1612 రిజల్యూషన్ కలిగి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రోసెసర్, Mali-G57 MC2 జీపీయూతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమేరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్ కెమేరా క్వాలిటీ కోసమే ఎక్కువగా కొంటారు. అలాంటిది ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటుంది. దీంతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 

ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండటంతో ఫోన్ పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ అయితే రెండవది 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ కలిగింది. ఈ ఫోన్ ప్రారంభధర 12 వేల రూపాయలుగా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఇస్తే ఆ ఫోన్ కండీషన్, మోడల్, బ్రాండ్‌ను బట్టి 6 వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 6 వేలకే లభిస్తుందన్నమాట.

Redmi 13C ఫీచర్లు, ధర, డిస్కౌంట్

రెడ్ మి కూడా అద్భుతమైన ఫోన్ లాంచ్ చేసింది. Redmi 13C ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 37 శాతం డిస్కౌంట్ ఉండటంతో 13,999 రూపాయల ఫోన్ కేవలం 10,499 రూపాయలకే లభించనుంది. ఇందులో 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్‌పై 1000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సి కార్డుపై కొనుగోలు చేస్తే 6జీబీ, 8 జీబీ ర్యామ్ ఫోన్లపై 750 రూపాయలు తగ్గింపు ఉంది. ఈ ఫోన్ 6.74 ఇంచెస్ హచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 

Also read: Infinix Hot 40i: 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50MP కెమేరాతో సూపర్‌ఫోన్ కేవలం 9 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News