Google Search: గూగుల్‌లో రెండు వెబ్‌ సైట్లను ఓపెన్‌ చేస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Google Search Engine: నేటికాలంలో ఇంటర్నెట్‌ ఉపయోగించేవారికి  గూగుల్ గురించి తెలియకుండా ఉండరు. దీనిని ఉపయోగించి ప్రపంచంలోని ఎలాంటి విషయాలనైనా ఒక క్లిక్‌తో తెలుసుకోవచ్చు.  గూగుల్‌ని ప్రతిరోజు కోట్లాది మంది ఓపెన్ చేసి వినియోగిస్తారు. అయితే ఈ గూగుల్‌లో రెండు వెబ్‌ సైట్లను ఓపెన్‌ చేస్తే మైండ్ బ్లోయింగ్‌ విషయాలు తెలుస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 04:10 PM IST
Google Search: గూగుల్‌లో రెండు వెబ్‌ సైట్లను ఓపెన్‌ చేస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Google Search  engine: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండటం వల్ల మన పనులను ఎంతో సులువుగా పూర్తి చేస్తుకుంటున్నాము. ముఖ్యంగా గూగుల్‌తో మన అందరికి విడదీయని బంధం. దీని ప్రతిరోజు మనం ఉపయోగించకుండా ఉండలేము. గూగుల్‌లో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. కొంతమంది వారి ప్రశ్నలను గూగుల్‌ ద్వారా ఇతర వెబ్‌ సైట్‌లలో వివరాలను తెలుసుకుంటారు. అయితే గూగుల్‌లో కొన్ని మైండ్‌ బ్లోయింగ్‌ సైట్‌లు ఉన్నాయి. 

ఈ సైట్‌లను ఓపెన్‌ చేయడం వల్ల ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌ సైట్‌ లిక్‌ తో మనం ఓ ఆట ఆడుకోవచ్చు. మరి ఆ వెబ్‌ సైట్‌లు ఏంటో మనం తెలుసుకుందాం. మీరు కూడా ఈ సైట్‌ను ట్రై చేయండి..

గూగుల్ పేజీ వింతగా కనిపిచే వింత సైట్‌ లు Google Gravity, Scale Of Universe ఇవే.  ఈ సైట్‌ను ఉపయోగించడం వల్ల మీరు ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతిని చెందుతారు. 

Google Gravity:

Google Gravity అనేది ఒక చిన్న JavaScript స్నిప్పెట్, ఇది గూగుల్‌ హోమ్‌పేజీని ఒక వింతగా కనిపించే భౌతిక అనుకరణగా మారుస్తుంది. ఈ సైట్‌ లో ఎక్కడ టచ్ చేసిన అన్ని కిందపడపోతాయి. మళ్లీ వాటిని యథాస్థానానికి తీసుకెళ్లి అంటే సాధ్యం కాని పని. దీనితో ఉపయోగించడం వల్ల మీరు కొత్త అనుభూతి పొందుతారు.

Scale Of Universe:

Scale Of Universe అనేది మరొక అద్భుతమైన Google హోమ్‌పేజీ . ప్రపంచంలో పరమాణువు నుంచి గెలాక్సీ వరకు ఏదీ ఎంత సైజు ఉందో పక్కాగా తెలుపుతుంది. దీని వల్ల ప్రతీ వస్తువు సైజు తెలుసుకోవచ్చు. ఇందులోని ఈ వివరాలు చూసి ఆశ్చర్యపోతారు. 

వీటిని ఎలా ఓపెన్ చేయాలి అంటే:

మీ వెబ్ బ్రౌజర్‌లో Google హోమ్‌పేజీని తెరవండి.

search engineలో "Googla Gravity" లేదా "Scale Of Universe" అని టైప్ చేయండి.

ఈ విధంగా వీటిని ఉపయోగించి మీరు కూడా కొత్త అవగాహనను పొందవచ్చు. 

Googla Gravity,  Scale Of Universe ఉపయోగకరంగా ఉంటాయి.మీకు భౌతిక శాస్త్రం, విశ్వం యొక్క పరిమాణం గురించి ఒక కొత్త అవగాహనను అందించగలవు.

ఇవే కాకుండా గూగుల్‌లో  చాలా వెబ్ సైట్లు క్రేజీగా అనిపిస్తాయి. అయితే కొన్ని వెబ్ సైట్లు సెర్చ్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాంగింగ్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సైట్‌లను ఉపయోగించాలి. అలాగే మాల్ వేర్ ప్రాబ్లమ్స్ వల్ల వాటిని టచ్ చేయకుండా ఉండడమే మంచిదని నిపుణులు  చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News