Iqoo Z9 5G Vs Nothing Phone 2A: ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్ మార్చి 14వ తేదిన భారత్ వ్యాప్తంగా అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్‌తో పాటు ఫీచర్స్‌ను కూడా వెల్లడించింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం రేంజ్ ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ధరలతో పాటు బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా ప్రకటించింది. అయితే ఈ మొబైల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే, నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడబోతోందని తెలుస్తోంది. అయితే ఈ రెండు మొబైల్స్ ధర, ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పరంగా అనేక తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐకూ Z9, నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్స్ మధ్య ప్రధాన తేడాల వివరాల్లోకి వెళితే, ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిప్ల్పేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 1300 nits స్క్రీన్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. ఈ మొబైల్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే, 6.67 అంగుళాల OLED డిస్ల్పేతో 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రాబోతోంది. దీంతో పాటు ఈ స్క్రీన్ 500 nits బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది.
ఇక ఈ రెండింటి స్టోరేజ్ విషయానికొస్తే..ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదట ఒక స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది 8GB, 12GB ర్యామ్, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు నథింగ్ ఫోన్ 2ఏ మొబైల్ 6GB, 8GB ర్యామ్, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ల్లో అందుబాటులోకి రానుంది. కెమెరాల విషయానికొస్తే, ఐకూ Z9 మొబైల్ త్రిపుల్ కెమెరా సెటప్‌లో లభిస్తోంది. దీని బ్యాక్ సెటప్‌లో 48MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇక నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ డబుల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది.
ఇక ఈ రెండు మొబైల్స్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్ 4700mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ Android 12, OriginOS Ocean ఒఎస్‌పై రన్ అవుతుంది. ఈ మొబైల్‌ను కంపెనీ గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్‌తో నిర్మించింది. ఇక నథింగ్ ఫోన్ 2ఏ మొబైల్ వివరాలు చూస్తే.. ఇది 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్ Android 13, Nothing ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే ఇది ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో లభిస్తోంది.
చివరిగా ఏ మొబైల్ బెస్ట్ అంటే, ఐకూ Z9, నథింగ్ ఫోన్ 2ఏ రెండూ మొబైల్స్ చాలా బెస్ట్.. ఐకూ Z9 మొబైల్‌లో ప్రీమియం డిస్ప్లే, ప్రాసెసర్, ర్యామ్, బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇక తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్ కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ చాలా బెస్ట్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి