ఒకే ఒక్క రీఛార్జ్.. అన్లిమిటెడ్ ఇంటర్నెట్, కాలింగ్ & సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ ఫ్రీ

మొబైల్ రీచార్జ్ తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా పొందాలి అనుకుంటున్నారా..? అయితే జియోలో వచ్చిన కొత్త ప్లాన్ లలో అన్లిమిటెడ్  ఇంటర్నెట్ తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా లభించనుంది. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 03:58 PM IST
ఒకే ఒక్క రీఛార్జ్.. అన్లిమిటెడ్ ఇంటర్నెట్, కాలింగ్ & సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ ఫ్రీ

JIO Recharge Plans: డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా అందించే రీచార్జ్ ప్లాన్ గురించి ఎదురుస్తున్నారా..? అయితే మీ ఎదురుచూపుకు బ్రేక్ పడింది అనుకోవచ్చు. జియో కొత్తగా రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఈ రీచార్జ్ ప్లాన్ తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా లభించనుంది. జియో తీసుకొచ్చిన 7 ప్లాన్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ రెండు ప్లాన్‌లలో ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. 

హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వాలిడిటీ.. 
జియో రూ. 328 ప్లాన్‌లో ఒక నెల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో, ప్రతిరోజూ 1.5 GB డేటా మరియు మూడు నెలల పాటు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 

రెండవ ప్లాన్ రూ. 388, దీనిలో ఒక సంవత్సరం వాలిడిటీ అందుబాటులో ఉంది. ఈ రీచార్జ్ లో ప్రతిరోజూ 2 GB డేటా మరియు మూడు నెలల పాటు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.

రూ. 759 ప్లాన్‌లో, మూడు నెలల వాలిడిటీ మరియు ప్రతిరోజూ 1.5 GB డేటా రాగా.. ఇందులో, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

Also Read: Samsung Galaxy F34 5G Price: రేపటికే లాస్ట్..SAMSUNG Galaxy F34 5G మొబైల్ పై రూ. 15,400 వరకు తగ్గింపు..  

ఇక రూ.808 ప్లాన్‌ విషయానికి వస్తే.. మూడు నెలల కాలపరిమితితో 2 జీబీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా, మూడు నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండనుంది. 

రూ. 598 రీఛార్జ్ ప్లాన్‌లో, ఒక నెల వాలిడిటీ రాగా.. ప్రతిరోజూ 2 GB డేటా అందుబాటులో ఉంది. ఇందులో, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా రానుంది. 

జియో యొక్క రూ. 3,178 రీఛార్జ్ ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో ఉండగా.. ప్రతిరోజూ 2 GB డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా రానుంది. 

Also Read: Regional Passport Office: ఏపీలో త్వరలో మరో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News