Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్

Lava Blaze X Launch: ప్రముఖ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ లావా నుంచి మరో శక్తివంతమైన ఫోన్ లాంచ్ కానుంది. 64 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్‌తో అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2024, 06:12 AM IST
Lava Blaze X: 64 మెగాపిక్సెల్ కెమేరా, 16 జీబీ ర్యామ్‌తో లావా నుంచి కొత్త ఫోన్

Lava Blaze X Launch: Lava Blaza X 5G త్వరలో అంటే జూలై 10వ తేదీన మార్కెట్‌లో లాంచ్ కానుంది. లావా కంపెనీ అధికారికంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చైనా స్మార్ట్‌ఫోన్లతో పోటీ పడుతున్న భారతీయ బ్రాండ్ లావా. ఆకర్షణీయమైన లుక్, ఫీచర్లతో మార్కెట్‌లో పోటీ పడుతోంది. ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే లావా కొత్త మోడల్ ఫోన్ లాంచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జూలై 10వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ఉంటుంది. Lava Blaza X 5G సరికొత్త లుక్‌తో ఉంటుంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో కుడి వైపు కార్నర్‌లో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటుంది. ఈ ఫోన్ యూఎస్‌బి టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే డివైస్ దిగువన ఉంటాయి. డిస్‌ప్లే అనేది పంచ్ హోల్ కట్ అవుట్‌తో ఉంటుంది. 

Lava Blaza X 5Gలో గోళాకారంలో కెమేరా మాడ్యూల్ డబుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. మెయిన్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది. అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో అతి తక్కువ ధరకు లభించే 5జి కావచ్చు. ఇందులో ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 

Lava Blaza X 5Gలో 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రే, డార్క్ బ్లూ రంగులో లభించనుంది. ఈ ఫోన్ ధర కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 

Also read: Income Tax Notice: ఈ 5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు తప్పవా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News