Nokia G42 Price: పింక్‌ కలర్‌లో Nokia నుంచి 5G మొబైల్‌..లాంచ్‌కి ముందే ఫీచర్స్‌తో యువత హృదయాలను గెలించింది!

Nokia G42 5G Launch Date In India: నోకియా కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. మొట్టమొదటి సారిగా పింక్‌ కలర్‌ వేరియంట్‌లో కంపెనీ విడుదల చేయబోతోంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2023, 12:47 PM IST
Nokia G42 Price: పింక్‌ కలర్‌లో Nokia నుంచి 5G మొబైల్‌..లాంచ్‌కి ముందే ఫీచర్స్‌తో యువత హృదయాలను గెలించింది!

 

Nokia G42 5G Launch Date In India: నోకియా కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీనిని కంటిన్యూ చేసేందుకు కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్స్‌లో స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే నోకియా అతి త్వరలోనే మొదటి 5G ఫోన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ దీనిని Nokia G42 5G పేరుతో విడుదల చేయబోతోందని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను 'పింక్' కలర్ వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే విడుదల తేదికి సంబంధించిన వివరాలను మాత్రం కంపెనీ ఇంకా అధికారికంగా వివరించలేదు. కానీ కొంతమంది టిప్‌స్టర్స్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన కీలక విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలు పలువురు టెక్‌ నిపుణులు షేర్‌ చేశారు. ఈ మొబైల్‌ ఫోన్‌ గ్రే (సో గ్రే), పర్పుల్ (సో పర్పుల్) అనే రెండు కలర్ వేరియంట్‌లలో కంపెనీ పరిచయం చేయబోతోందని తెలస్తోంది. అంతేకాకుండా  ఈ ఫోన్ రూ. 20 వేల లోపే ఉంటుందని టెక్‌ నిపుణులు వెల్లడించారు. ఇక కంపెనీ పింక్‌ కలర్‌ వేరియంట్‌ను మొదట భారత్‌లోనే అందుబాటులోకి తీసుకు రాబోతోందని తెలుస్తోంది. అంతేకాకుండా కొంత మంది టెక్‌ నిపుణులు ఈ మొబైల్‌ ఫోన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోందని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై కంపెనీ అధికారిక ప్రకట చేసే వరకు వేచి చూడాల్సిందే. 

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

Nokia G42 5G ధర:
నోకియ కంపెనీ మొదట ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తే..మొదటగా అమెజాన్‌లో విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే Nokia G42 5G ధర విషయానికొస్తే..రూ.16,000 నుంచి ప్రారంభమై..ప్రీమియం వేరియంట్‌ రూ.18,000లోపే లభించనుంది. ఈ రెండు వేరియంట్స్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ 4GB+128GB, 6GB+256GB జీబిలను కలిగి ఉంటుంది.  దీంతో పాటు కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్‌ పరికరాలను కూడా విడుదల చేయబోతోంది. 

Nokia G42 5G స్పెసిఫికేషన్స్:
✾ 6.56 అంగుళాల డిస్‌ప్లే
✾ HD+ రిజల్యూషన్ 
✾ 90Hz రిఫ్రెష్ రేట్‌
✾ Qualcomm Snapdragon 480 ప్రాసెసర్‌
✾ ఆండ్రాయిడ్ 13
✾ 50MP ప్రైమరీ లెన్స్‌ కెమెరా
✾ 2MP మాక్రో కెమెరా
✾ 2MP డెప్త్ సెన్సార్‌ కెమెరా
✾ 8MP సెల్ఫీకెమెరా
✾ 5000mAh బ్యాటరీ
✾ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
✾ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 
✾ OZO-శక్తితో కూడిన లౌడ్‌స్పీకర్

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News