OnePlus 12 Price Down: భలే బ్యాంక్‌ ఆఫర్స్‌.. OnePlus 12 మొబైల్‌ను అత్యంత చౌకగా కొనండి ఇలా!

OnePlus 12 Price Down: ప్రీమియం రేంజ్‌లో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌. వన్‌ప్లస్‌ అధికార వెబ్‌సైట్‌లో కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ నడుస్తున్నాయి. ఈ డీల్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 29, 2024, 11:58 AM IST
OnePlus 12 Price Down: భలే బ్యాంక్‌ ఆఫర్స్‌.. OnePlus 12 మొబైల్‌ను అత్యంత చౌకగా కొనండి ఇలా!

OnePlus 12 Price Down: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. మీ కోసం వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్‌ అందిస్తుంది. వీటితో కొనుగోలు చేస్తే చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు వన్‌ప్లస్‌ వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఎంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 16 GB ర్యామ్‌, 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 12 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఇందులో 12 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.64,999కు లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాక్‌ ఆఫర్స్‌లో భాగంగా OneCard క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను కేవలం రూ.62,999కు అందుబాటులో ఉంటుంది. 

అలాగే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌ కొన్ని పరికరాలపై ప్రత్యేకమైన కూపన్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫతో పాటు వన్‌ప్లస్‌ బడ్స్‌, కేస్‌ని కొనుగోలు చేసేవారికి దాదాపు 38 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా కొన్ని ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు.   

Also Read: Weight Loss In 10 Days: ఎండా కాలంలో పింపుల్‌గా 10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారికి నిపుణుల సూచనలు ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రాసెసర్: కొత్త స్నాప్‌డ్రాగన్‌ 3 ప్రాసెసర్
డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే
ర్యామ్: 8GB, 12GB, 16GB LPDDR5 RAM
స్టోరేజ్: 128GB, 256GB, 512GB UFS 3.1 స్టోరేజ్
రియర్ కెమెరా: 50MP ప్రధాన సెన్సార్, 48MP వైడ్ యాంగిల్ లెన్స్, 32MP టెలిఫోటో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 16MP సెన్సార్
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read: Weight Loss In 10 Days: ఎండా కాలంలో పింపుల్‌గా 10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారికి నిపుణుల సూచనలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News