OnePlus 12 Price: బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో 12 GB ర్యామ్‌ OnePlus 12పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌!

OnePlus 12 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌ ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 27, 2024, 02:28 PM IST
OnePlus 12 Price: బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో 12 GB ర్యామ్‌ OnePlus 12పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌!

OnePlus 12 Price: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం రేంజ్‌లో విడుదల చేసిన కొన్ని మొబైల్స్‌ కూడా అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి.  ముఖ్యంగా OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఈ సేల్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్ తగ్గింపు కూడా లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ వివిధ రకాల కలర్‌, స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.64,999తో లభిస్తోంది. అయితే దీనిని ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 3 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్‌ పోను రూ.62,999కే పొందవచ్చు. ఇవే కాకుండా బ్యాంక్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు ముందుగా HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసి 5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.63,499కే పొందవచ్చు. 

ఇక ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన  50MP Sony ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ప్రత్యేకమైన పోర్ట్రెయిట్‌ ఫోటోస్‌ కోసం 64 MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 48 MP అల్ట్రా-వైడ్ 114° ఫోవ్ ఎలైట్ అదనపు కెమెరాను కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది QualcommLaten3 ఆప్టిమైజేషన్ ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది..కాబట్టి ఎలాంటి యాప్స్‌ అయిన దాదాపు 72 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటాయి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ మొబైల్‌ అద్భుతమైన గేమింగ్ ప్రిస్టైన్ 2K డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా సరికొత్త టెక్నాలజీతో కూడిన LTPOతో 2K 120 Hz ProXDR డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అలాగే అదనంగా ఇందులో వన్‌ప్లస్‌ కంపెనీ ఐ కేర్ TÜV రైన్‌ల్యాండ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. తడి చేతులతో కూడా స్వైప్ చేయడానికి  ఆక్వా టచ్ ఫీచర్‌ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 14  ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అలాగే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5400 mAh బ్యాటరీ, వైర్డ్ 100W సూపర్‌వోక్ - అల్ట్రా-ఫాస్ట్ వైర్‌లెస్ సపోర్ట్‌ ఫీచర్స్‌ను కూడా అందుబాటులో ఉంటాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News