OnePlus Nord 4: వన్‌ప్లస్‌ నుంచి గుడ్‌న్యూస్‌.. 7000mAh బ్యాటరీతో OnePlus Nord 4 వచ్చేస్తోంది!

OnePlus Nord 4: త్వరలోనే వన్‌ప్లస్‌ (OnePlus) నుంచి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే Nord 4 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2024, 04:09 PM IST
OnePlus Nord 4: వన్‌ప్లస్‌ నుంచి గుడ్‌న్యూస్‌.. 7000mAh బ్యాటరీతో OnePlus Nord 4 వచ్చేస్తోంది!

OnePlus Nord 4: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ (OnePlus) నుంచి కస్టమర్స్‌కి మరో శుభవార్త తెలపబోతోంది. ఎంతో ప్రముఖ్యత కలిగిన నార్డో సిరీస్‌ను ఆప్డేట్‌ వేరియంట్‌లో లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Nord 4 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన  Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్‌కి మంచి గుర్తింపు రావడంతో ఈ Nord 4 మోడల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఈ బ్యాటరీని Oga Group అనే సంయుక్త పరిశోధన ద్వారా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాటరీ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Ace 3 ప్రో మోడల్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది శక్తివంతమైన 6100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్‌ Nord 4 స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ Oneplus Nord 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన అభివృద్ధి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ లాంచింగ్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వచ్చే సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే నార్డ్‌ సిరీస్‌లో శక్తివంతమైన ఫోన్‌గా అవతరించే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే వన్‌ప్లస్‌ త్వరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా వెల్లడించే ఛాన్స్‌ కూడా ఉంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో డబుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కొత్త బ్యాటరీ సిలికాన్ మెటీరియల్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని బ్యాటరీ పరిమాణం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News