OPPO A17: క్యూట్ డిజైన్, అద్భుత ఫీచర్లతో Oppo A17 లాంచ్, ధర, ఫీచర్లు ఇలా

OPPO A17: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో అద్భుతైన ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అత్యుత్తమ కెమేరా, బ్యాటరీ, స్క్రీన్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువ. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2022, 04:30 PM IST
OPPO A17: క్యూట్ డిజైన్, అద్భుత ఫీచర్లతో Oppo A17 లాంచ్, ధర, ఫీచర్లు ఇలా

OPPO A17: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో అద్భుతైన ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అత్యుత్తమ కెమేరా, బ్యాటరీ, స్క్రీన్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువ. ఆ వివరాలు మీ కోసం..

ఒప్పో ఏ సిరీస్‌లో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Oppo A17 లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర కూడా తక్కువే. కేవలం పది వేలకే లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, బిగ్ సైజ్ స్క్రీన్ ఉన్నాయి. ఇంకా ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

Oppo A17 రెండు రంగుల్లో లభ్యమౌతోంది. లేక్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇండియాలో 10 వేల వరకూ ఉంటుంది. సింగపూర్‌లో ప్రీ ఆర్డర్ అందుబాటులో ఉంది. 

Oppo A17 ఫీచర్లు

ఒప్పో ఏ17లో హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 6.56 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇందులో 100 శాతం డీసీఐ పీ3 కలర్ వేరియేషన్ ఉంది. స్క్రీన్ నాలుగువైపులా వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఈ డివైస్ మీడియాటెక్ హెలియా జి35 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా కాగా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికొస్తే..5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 

Also read: Insta new Feature: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్, ఇక స్టోరీ అప్‌లోడ్ మరింత ఈజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News