POCO C51 vs Xiaomi Redmi A2: ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌లో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, కెమెరా, ధర పరంగా ఇదే బెస్ట్‌..

POCO C51 vs Xiaomi Redmi A2: ప్రస్తుతం చాలా మంది ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌లో ఏ మొబైల్‌ కొనుగోలు చేయాలా అని తికమకపడుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఈ POCO C51, Xiaomi Redmi A2 మొబైల్స్‌లో బెస్ట్‌ స్మార్ట్‌ను తెలియజేయబోతున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 01:10 PM IST
POCO C51 vs Xiaomi Redmi A2: ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌లో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, కెమెరా, ధర పరంగా ఇదే బెస్ట్‌..

 

POCO C51 vs Xiaomi Redmi A2: మార్కెట్‌లోకి మిడిల్‌ క్లాస్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీ అతి తక్కువ ధరల్లో మోబైల్స్‌ని తయారు చేసి విక్రయిస్తున్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో లభించే మంచి స్మార్ట్‌ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గత సంవత్సరంలోని మార్కెట్‌లోకి లాంచ్ అయిన వాటిలో అతి తక్కువ ధరల్లో లభించే మొబైల్‌ POCO C51, Xiaomi Redmi A2. చాలా మంది వీటిలో ఏ మొబైల్‌ బెస్ట్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.  అయితే వీటిల్లో ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ధర పరంగా బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఈ రెండు POCO C51, Xiaomi Redmi A2 స్మార్ట్‌ ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండు రూ.5,499 ధరతో లభిస్తున్నాయి. ఈ మొబైల్స్‌ 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తున్నాయి. అంతేకాకుండా అమెజాన్‌ ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.  ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ 4Gb ర్యామ్‌ MediaTek Helio G36 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉన్నాయి. 

దీంతో పాటు ఈ రెండు మొబైల్స్‌  6.52 డిస్ల్పేతో లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్స్‌ 8MP బ్యాంక్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. ఇక ఫ్రంట్‌ కెమెరా విషయానికొస్తే POCO C51, Xiaomi Redmi A2 స్మార్ట్‌ ఫోన్‌ 5MP కెమెరాలను కలిగి ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికొస్తే..ఇవి రెండు 5000 mAh బ్యాటరీ సెటప్‌తో అందుబాటులో ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ భాగంగా ఈ ఇవి రెండు ఆండ్రాయిడ్ v13తో రన్‌ అవుతాయి.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఇక CPU వివరాల్లోకి వెళితే ఈ రెండు మొబైల్స్‌ ఆక్టా కోర్ (2.2 GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A53 + 1.8 GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A53)తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు PowerVR GE8320 గ్రాఫిక్స్ సమర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ రెండు LCD డిస్ల్పేలతో అందుబాటులోకి వచ్చాయి. ఈ డిస్ల్పే 720 x 1600 పిక్సెల్స్‌ను కలిగి ఉంటాయి. కెమెరా ఫీచర్స్‌లో భాగంగా POCO C51 స్మార్ట్‌ ఫోన్‌లో హై డైనమిక్ రేంజ్ మోడ్ (HDR) షూటింగ్ మోడ్‌ను లైఫ్ టైమ్‌ కలిగి ఉంటే..Xiaomi Redmi A2 మాత్రం అప్పుడప్పుడు వర్క్‌ చేస్తుంది. 

కెమెరా ఫీచర్స్‌ పరంగా POCO C51 మొబైల్‌ డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. కానీ Redmi A2 కేవలం డిజిటల్ జూమ్‌ని మాత్రమే కలిగి ఉంటుంది. రెడ్‌ మీ USB OTG సపోర్ట్‌తో లభిస్తోంది. పోకోలో అదనంగా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News