Poco X6 Price: మరీ ఇంత చీపా.. అమెజాన్‌లో 256 GB స్టోరేజ్ Poco X6 మొబైల్‌ రూ.1,199కే.. నమ్మట్లేదా?

Poco X6 Price Dropped: అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా చాలా రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 7, 2024, 04:32 PM IST
Poco X6 Price: మరీ ఇంత చీపా.. అమెజాన్‌లో 256 GB స్టోరేజ్ Poco X6 మొబైల్‌ రూ.1,199కే.. నమ్మట్లేదా?

 

Poco X6 Price Dropped: అత్యంత తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో గ్రేట్‌ ఫ్రిడమ్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌, స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసేవారికి అత్యంత తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి 20 నుంచి 35 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏ మొబైల్‌పై ప్రత్యేకమైన తగ్గింపు అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో గ్రేట్‌ ఫ్రిడమ్‌ సేల్‌లో భాగంగా POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మార్కెట్‌లో మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. గరిష్టంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే దీని బేస్‌ వేరియంట్‌ మార్కెట్‌లో MRP ధర రూ.24,999తో లభిస్తోంది. ఇక ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 24 శాతం తగ్గింపుతో కేవలం రూ.18,999కే పొందవచ్చు. 

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ పోను కేవలం రూ.17,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్ ఉన్న ఎక్చేంజ్‌ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. పాత బ్రాండెండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ.17,800 వరకు బోనస్‌ కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌ పోను రూ.1,199కే సొంతం చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

POCO X6 5G స్మార్ట్‌ఫోన్ టాప్ ఫీచర్లు:
స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ 
ట్రిపుల్ రెయర్ కెమెరా సెటప్
33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్
పెద్ద బ్యాటరీ 
 AMOLED డిస్‌ప్లే
5G కనెక్టివిటీ
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌
ఆకర్షణీయమైన డిజైన్‌
ఒకే చార్జ్‌తో రోజంతా బ్యాటరీ సౌకర్యం

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News