Realme Narzo 70 5G Price Cut: అమెజాన్‌లో Realme Narzo 70 5G మొబైల్‌పై రూ.13,250 డిస్కౌంట్‌.. మాములు డిస్కౌంట్‌ కాదు..

Realme Narzo 70 5G Price Cut: ప్రీమియం ప్రధాన కెమెరా కలిగిన realme NARZO 70 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 17, 2024, 12:16 PM IST
Realme Narzo 70 5G Price Cut: అమెజాన్‌లో Realme Narzo 70 5G మొబైల్‌పై రూ.13,250 డిస్కౌంట్‌.. మాములు డిస్కౌంట్‌ కాదు..

Realme Narzo 70 5G Price Cut: మార్కెట్‌లో 50MP ప్రధాన కెమెరా స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. యువత ఎక్కువగా ఇలాంటి కెమెరాలు కలిగి మొబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చీప్‌ ధరల్లోనే 50MP మెయిన్‌ కెమెరా కలిగిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మీరు కూడా ఎప్పటి నుంచో ఇలాంటి కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో రియల్‌ మీ కంపెనీ లాంచ్‌ చేసి ప్రీమియం లెన్స్‌ కెమెరా కలిగిన realme NARZO 70 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. 

ప్రస్తుతం మార్కెట్‌లో realme NARZO 70 5G స్మార్ట్‌ఫోన్‌ 6 GB ర్యామ్ + 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్‌ 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఇందులోని బేస్‌ వేరియంట్‌ను అత్యధిక తగ్గింపుతో విక్రయిస్తోంది. మార్కెట్‌లో ఈ మొబైల్‌ MRP ధర రూ.20,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 33 శాతం వరకు డిస్కౌంట్‌తో రూ.13,999కే పొందవచ్చు.

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసేవారికి ఆకర్షనీయమైన నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.13,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ realme NARZO 70 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.749కే పొందవచ్చు. 

టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్‌:
ప్రాసెసర్: MediaTek Dimensity 7050 5G చిప్సెట్.
డిస్‌ప్లే: 6.78 ఇంచుల ఫుల్ HD+ లిక్విడ్ కూల్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
కెమెరాలు: 50MP ప్రైమరీ కెమెరా + 2MP మైక్రో కెమెరా + 2MP మ్యాక్రో కెమెరా, సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా.
ర్యామ్ మరియు స్టోరేజ్: 8GB ర్యామ్ (వర్చువల్ ర్యామ్‌తో 13GB వరకు), 128GB స్టోరేజ్ (మైక్రో SD కార్డ్ సపోర్ట్).
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 33W SUPERVOOC ఛార్జింగ్.
ఆపరేటింగ్ సిస్టమ్: Android 12 ఆధారిత Realme UI 3.0.
డిజైన్: స్లిమ్, స్టైలిష్ డిజైన్.
సెన్సార్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (సైడ్), యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కాంపాస్.
కనెక్టివిటీ: 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB Type-C.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News