Realme P1 Pro Price Cut: ఈ Realme మొబైల్‌పై భారీ ఆఫర్స్.. ఎగబడి కొంటున్న జనాలు!

Realme P1 Pro Price Cut: రియల్ మీ (Realme) నుంచి ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్ ఛీప్‌లో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2024, 04:29 PM IST
Realme P1 Pro Price Cut: ఈ Realme మొబైల్‌పై భారీ ఆఫర్స్.. ఎగబడి కొంటున్న జనాలు!

Realme P1 Pro Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్ మీ (Realme) నుంచి మార్కెట్‌లో కొత్త మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ P సిరీస్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఏప్రిల్ 15వ తేదిన Realme P1తో పాటు Realme P1 ప్రో అనే పేర్లతో రెండు మొబైల్స్‌ లాంచ్‌ అయ్యాయి. ప్రస్తుతం టాప్-ఎండ్ మోడల్ Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన తగ్గింపుతో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేవలం 12 గంటలే ఈ ఆఫర్‌:
ఈ Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్‌ విభిన్న స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో బేస్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్‌  8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ. 22,999తో లభిస్తోంది. ఈ మొబైల్స్‌లో మొదటి వేరియంట్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.2500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు టాప్‌ మోడల్‌పై ఏకంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌ మోడల్ ధర రూ. 19,499, 256GB వేరియంట్ ధర రూ.18,999కే పొందవచ్చు.  
 
ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. 128GB మోడల్‌పై  రూ. 2,500 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా పొందవచ్చు. ఇక 256GB స్టోరేజ్‌ మోడల్‌పై రూ. 4,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ OLED కర్వ్డ్ డిస్‌ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్
2000 nits పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌
50-మెగాపిక్సెల్ ప్రధాన Sony LYT-600 కెమెరా 
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
16-మెగాపిక్సెల్ లెన్స్ కెమెరా
45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ
473.58 గంటల స్టాండ్‌బై 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News