Realme P1 Series: 50 మెగాపిక్సెల్ కెమేరా, 8జీబీ ర్యామ్ ఫోన్ కేవలం 18 వేలకే

Realme P1 Series Discount Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రియల్ మి లాంచ్ చేసిన Realme P1 5Gపై ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రారంభం కానుంది. రియల్ మి ప్రత్యేక తగ్గింపు ధరలు ఇవ్వనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2024, 12:25 PM IST
Realme P1 Series: 50 మెగాపిక్సెల్ కెమేరా, 8జీబీ ర్యామ్ ఫోన్ కేవలం 18 వేలకే

Realme P1 Series Discount Sales: Realme నుంచి ఇటీవలే Realme P1,P1 Pro స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పటికే ఈ ఫోన్ విక్రయాలు జరుగుతున్నా ఇప్పుడు నేరుగా కంపెనీ ప్రత్యేక డిస్కౌంట్ సేల్ ఆఫర్ నడిపిస్తోంది. మే 21వ తేదీన ప్రత్యేక సేల్  నిర్వహించనుంది కంపెనీ.

Realme P1 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ కలిగి ఉండటంతో అసలు వేడెక్కదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ అందిస్తుంది. ఇక ఛార్జింగ్ అయితే 45 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ సామర్ద్యం కూడా ఉంటుంది. 

ఇందులో డబుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50మెగాపిక్సెల్ సోనీ లిట్ 600 కెమేరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమేరా ఉంటుంది. ఇక సెల్ఫీలేదా వీడియో కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్లపై మే 21 వతేదీ మద్యాహ్నం 12 గంటల్నించి రాత్రి 12 గంటల వరకూ ప్రత్యేక సేల్ నడవనుంది. 2 వేల నుంచి 3 వేల వరకూ డిస్కౌంట్ ఉంటుంది. ఇందులో బేసిక్ వేరియంట్ ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా ఇప్పుడు ఇకపై కేవలం 17,999 రూపాయలకే లభించనుంది. అదే 256 జీబీ స్టోరేజ్ అయితే 22999 రూపాయలు కాగా ప్రత్యేక సేల్‌లో 19,999 రూపాయలకు లభిస్తుంది.

Also read: Tatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News