Redmi 13C Price Cut: ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఛార్జర్‌ ధరకే 128Gb స్టోరేజ్‌ Redmi 13C మొబైల్‌.. ఏకంగా రూ.7,300 తగ్గింపు!

Redmi 13C Price Cut: ఉగాది (Ugadi 2024) సందర్భంగా అన్నీ ఈ కామర్స్ కంపెనీలు ప్రత్యేకమైన డీల్స్ ను ప్రారంభించాలి. ముఖ్యంగా అమెజాన్ రెడ్‌మీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇటీవలే లాంచ్ అయినా రెడ్‌మీ 13c (Redmi 13C) స్మార్ట్ ఫోన్ అమెజాన్లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 7, 2024, 01:30 PM IST
Redmi 13C Price Cut: ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఛార్జర్‌ ధరకే 128Gb స్టోరేజ్‌ Redmi 13C మొబైల్‌.. ఏకంగా రూ.7,300 తగ్గింపు!

 

Redmi 13C Price Cut: ఉగాది (Ugadi 2024) సందర్భంగా అన్నీ ఈ కామర్స్ కంపెనీలు ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించాయి. ముఖ్యంగా ఈ ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్ తో పాటు ఫ్లిప్కార్ట్ ఆకర్షనీయమైన బ్యాంక్ ఆఫర్స్ అందిస్తున్నాయి. అంతేకాకుండా అమెజాన్ కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డీల్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కొన్ని ఇంటర్నేషనల్ టెక్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా ప్రకటించింది. ప్రముఖ చైనీస్ కంపెనీ రెడ్‌మీ(Redmi) ఇటీవల మార్కెట్లోకి లాంచ్ చేసిన కొన్ని మొబైల్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తున్నాయి. 

అమెజాన్‌లో ఉగాది(Ugadi 2024) ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా రెడ్‌మీ 13c (Redmi 13C) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికోసం అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా 31 శాతం తగ్గింపు లభించడమే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ రెడ్‌మీ 13c (Redmi 13C) స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌తో పాటు మూడు విభిన్న స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర MRP రూ. 11,999కు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఉగాది ప్రత్యేకమైన డీల్ లో భాగంగా 36 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్ ధర రూ. 7,699కే అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

ఇక ఈ రెడ్‌మీ 13c స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని జే అండ్ కే బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ. 769 వరకు ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ అనుసంధాన ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఈ రెడ్‌మీ 13c  స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ను వినియోగించాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాని వ్యాల్యూ ని బట్టి రూ.7,300 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీరు ఎక్స్చేంజ్ చేసి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో పాటు కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. పాత మొబైల్ కండిషన్ బాగుంటేనే ఈ తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ రెడ్‌మీ 13c (Redmi 13C) మొబైల్ కేవలం రూ. 399లోపే పొందవచ్చు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News