Republic Day Sale 2024: సంగం ధరలకే Redmi 13C, Poco C51, Narzo N53 మొబైల్స్‌..డిస్కౌంట్ వివరాలు ఇలా..

Republic Day Sale 2024 Mobile Offers: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా Redmi 13C, Poco C51 మొబైల్స్‌ చీప్‌ ధరలో లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 12:23 PM IST
Republic Day Sale 2024: సంగం ధరలకే Redmi 13C, Poco C51, Narzo N53 మొబైల్స్‌..డిస్కౌంట్ వివరాలు ఇలా..

Republic Day Sale 2024 Mobile Offers: అమెజాన్‌లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరలకు లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ సేల్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొన్ని టెక్‌ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌పై ప్రత్యేక బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ అమెజాన్ సేల్‌లో రూ.8,000లోపు లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ సేల్‌లో ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌ చీప్‌ ధరలో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Redmi 13C:
ప్రస్తుతం ఈ Redmi 13C స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌లో 4 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. రెడ్‌మీ ఈ మొబైల్‌ను మార్కెట్‌లో MRP రూ.11,999తో విక్రయిస్తోంది. అయితే రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా  ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 8,999కే లభిస్తోంది. దీంతో పాటు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఇక EMIతో కొనుగోలు చేసేవారు రూ. 436 చెల్లించి పొందవచ్చు. ఫీచర్స్‌ విషయానికొస్తే..ఈ స్మార్ట్ ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రోటక్షన్‌తో లభిస్తోంది. దీంతో పాటు 50-మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా పొందవచ్చు.  

Poco C51:
ప్రస్తుతం రియల్‌మీ టెక్‌ బ్రాండ్‌ విడుదల చేసిన బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్స్‌లో Poco C51 ఒకటి..ఈ మొబైల్‌ 4 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. అయితే ఈ అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ కేవలం రూ.5,799కే లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక కూపన్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఇక ఈ Poco C51 మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ విషయానికొస్తే..ఈ స్మార్ట్ ఫోన్‌ 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు  ఈ డిస్ప్లే 400 నిట్‌ల గరిష్టమైన బ్రైట్‌నెస్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

Realme Narzo N53:
ప్రస్తుతం ఈ Realme Narzo N53 స్మార్ట్ ఫోన్‌  4 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ ధర రూ.7,999తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.300 కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే..90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు  Unisoc T612 చిప్‌సెట్‌, 50 మెగాపిక్సెల్ AI కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News