Samsung Galaxy M14 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Samsung Galaxy M14 5G మొబైల్‌పై రూ.6,148 ఫ్లాట్‌ డిస్కౌంట్‌, ధర, డిస్కౌంట్ వివరాలు!

Samsung Galaxy M14 Price: ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా Samsung Galaxy M14 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే అతి చౌకగా పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 11:05 AM IST
 Samsung Galaxy M14 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Samsung Galaxy M14 5G మొబైల్‌పై రూ.6,148 ఫ్లాట్‌ డిస్కౌంట్‌, ధర, డిస్కౌంట్ వివరాలు!

 

Samsung Galaxy M14 Price: గత నెలలోనే ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ దీపావళి సేల్‌ ముగిసిన సంగతి తెలిసిందే..అయితే మరో సారి ఫ్లిఫ్‌కార్ట్‌ సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని బొనాంజా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ డిసెంబర్‌ 6వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. అన్ని రకాల వస్తువులను ఈ సేల్‌ భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరలోనే లభించబోతున్నాయి. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్‌ ఫోన్స్‌ అతి చౌకగా లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ బొనాంజా ప్రత్యేక సేల్‌కి ముందే ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. ఈ డీల్స్‌ భాగంగా కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరల్లోనే స్మార్ట్‌ ఫోన్స్‌ లభించనున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌లో Samsung Galaxy M14 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌  6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర రూ. 18,990 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 26 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా రూ.5,148 వరకు కూడా తగ్గింపు లభిస్తుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్‌ ఆఫర్స్‌ వాడితే మరింత తగ్గింపు ధరకు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్  వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి దాదాపు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లపై కూడా ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.  

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు:
ఈ Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్‌ 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే పూర్తి HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. దీని స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్‌లో పని చేస్తుంది. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో పాటు చాలా రకాల స్పెషిఫికేషన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఇతర ఫీచర్స్‌:
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
f/1.8 ఎపర్చర్‌ కెమెరా మోడ్‌
2-మెగాపిక్సెల్ అదనపు కెమెరా
13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
1080p రిజల్యూషన్ వరకు వీడియో రికార్డ్‌ ఫీచర్‌
6000mAh బ్యాటరీ
25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News