Sony Xperia PRO C: DSLR కెమెరా సెటప్‌తో Sony Xperia PRO C వచ్చేస్తోంది.. కెమెరా చూస్తే కొనడం ఖాయం!

Sony Xperia PRO-C: సోనీ నుంచి మార్కెట్‌లోకి ప్రీమియం కెమెరాతో కూడి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన కెమెరాతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 22, 2024, 04:47 PM IST
Sony Xperia PRO C: DSLR కెమెరా సెటప్‌తో Sony Xperia PRO C వచ్చేస్తోంది.. కెమెరా చూస్తే కొనడం ఖాయం!

Sony Xperia PRO-C: ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం త్వరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సోనీ గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం త్వరలోనే Sony Xperia PRO-C స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది అద్భతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Xperia 1 VI, Xperia 10 VI స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

ఇటీవలే ఈ Xperia PRO-C స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. ఈ మొబైల్‌ కాంపాక్ట్ డిజైన్, ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6-అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది యాంటీ-రిఫ్లెక్షన్ కోటింగ్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ స్క్రీన్‌  2K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ZEISS కెమెరా టెక్నాలజీని కలిగి ఉంటుంది. 

ఈ Xperia PRO-C స్మార్ట్‌ఫోన్‌ f/1.8 ఎపర్చరుతో పాటు 20mm ఫోకల్ లెంగ్త్‌ లెన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 50 MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఈ ప్రధాన సెన్సార్ RAW 12-బిట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది  ఓమ్నివిజన్ సెన్సార్‌ సెటప్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 14-బిట్ DCG RAW ఫీచర్స్‌రు కలిగి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ స్మార్ట్‌ఫోన్‌ 12MP సెకండరీ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 60fps RAW రికార్డింగ్ ఫీచర్స్‌తో వస్తోంది. అలగే ఇందులో Sony S-Cine-Tone పీచర్స్‌ కూడా లభిస్తుంది. ఇది క్రియేటివ్ లుక్‌కి కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ 12GB ర్యామ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 4K 60fps HDR రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 20mm ఫోకల్ లెంగ్త్‌ను కలిగి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News