Drop Tata Play Set Top Box Price: ప్రస్తుతం మార్కెట్‌లో ఆండ్రాయిడ్ టీవీ విక్రయాలు పెరిగిపోయాయి. అతి తక్కువ ధరలోనే పెద్ద పెద్ద స్క్రీన్‌తో కూడిన టీవీలు అందుబాటులో ఉండడంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ స్మార్ట్ టీవీలు 4k, HD రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి అనుగుణంగానే సెట్-టాప్ బాక్స్‌లను చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మేము దీపావళి ఆఫర్స్‌లో భాగంగా అతి తక్కువ ధరలోనే సెట్-టాప్ బాక్స్‌ను పరిచయం చేయ్యబోతున్నాం..
ఈ దీవాళి ఆఫర్స్‌లో భాగంగా టాటా ప్లేతో DTH కనెక్షన్‌ని ఎంచుకునే వినియోగదారులకు బంఫర్ తగ్గింపు లభించబోతోంది. ప్రీమియం HD బాక్స్ కనెక్షన్‌ని రూ.899కే కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఇందులో OTTలకు సంబంధించిన మూవీస్ స్ట్రీమింగ్ సపోర్ట్ లేకపోయిన ఎన్నో రకాల ఛానెల్స్ అతి తక్కువ ధరలోనే పొందే అవకాశాలను కంపెనీ అందిస్తోంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
టాటా ప్లే హెచ్‌డి బాక్స్ స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు:
టాటా ప్లే హెచ్‌డి బాక్స్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ బాక్స్ చాలా రకాల HD చానెల్స్‌తో పాటు మంచి ఆడియో అనుభూతిని పొందడానికి STB డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు 1080i రిజల్యూషన్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఈ టాటా ప్లేలో అనేక HD ఛానెల్ ప్యాక్‌తో పాటు హై రిజల్యూషన్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మీరు టాటా ప్లే HD STB సహాయంతో హై-డెఫినిషన్ ఛానెల్‌ను కూడా టాటా అందిస్తోంది.
ప్రత్యేక తగ్గింపు:
ఈ టాటా ప్లే హెచ్‌డి బాక్స్‌ను కొనుగోలు చేసేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే..ఈ బాక్స్ కేవలం HD TVలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే దీనిని వినియోగించి ఇతర టీవీల్లో కూడా చూడవచ్చు కానీ హెచ్‌డీ పిక్చర్ క్వాలిటీని పొందలేరు. ప్రస్తుతం టాటా ప్లే HD బాక్స్ ధర రూ. 1099 కాగా అధికారిక వెబ్‌సైట్‌లో TPL200 కూపన్ కోడ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు రూ.899కే టాటా ప్లే HD బాక్స్ పొందుతారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook