Vivo G2 5G Launch: మొబైల్ మార్కెట్‌లో వివో కంపెనీ వాటా ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అద్బుతమైన ఫీచర్లతో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇటీవల వివో కంపెనీ లాంచ్ చేసిన VIVO G2 అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..
వివో కంపెనీ లాంచ్ చేసిన VIVO G2 వాస్తవానికి ఒక బడ్జెట్ ఫోన్. కానీ ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. జనవరి 8వ తేదీన మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. బ్యాక్ కెమేరా 13 మెగాపిక్సెల్ విత్ జూమ్ వస్తుంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. బయోమెట్రిక్ దృవీకరణకై సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్లు పరిశీలిస్తే..6.56 ఇంచెస్ ఎల్‌సీడీ స్క్రీన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రోసెసర్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉండటం ప్రత్యేకత. 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆదారంగా నడుస్తుంది. బ్యాటరీ 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
VIVO G2లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 14 వేలు కాగా, ఇందులోనే 6 జీబీ వేరియంట్, 128 జీబీ స్టోరేజ్ ధర 17,500 రూపాయలుంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర 18,700 రూపాయలుంది. ఆన్‌లైన్ కొనుగోలు, బ్యాంక్ క్రెడిట్ కార్డులతో తీసుకుంటే 1500 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదొక 5జి స్మార్ట్‌ఫోన్.
Also read: EPFO New Members: రికార్డుస్థాయిలో పెరిగిన EPFO సభ్యుల సంఖ్య.. ఒక్క నెలలోనే 13.95 లక్షల మంది చేరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook