Xiaomi Smartphones: షియోమి నుంచి మరో రెండు మోడల్స్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అద్భుత ఫీచర్లతో అతి తక్కువ ధరకే ప్రవేశపెట్టడంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
ఇండియాలో Redmi A1 నిన్న మంగళవారం అంటే సెప్టెంబర్ 5న లాంచ్ అయింది. షియోమి రెడ్ మి 11 ప్రైమ్, రెడ్ మి 11 ప్రైమ్ 4జి స్మార్ట్ ఫోన్లను ఒకేసారి లాంచ్ చేసింది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో A22 SoCతో అనుసంధానమై ఉంటుంది. Redmi A1లో 8 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20 కంటే ఎక్కువ భాషల్ని సపోర్ట్ చేస్తుంది.
Redmi A1 ఇండియాలో ధర
Redmi A1 ధర 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,999 రూపాయలుగా ఉంది. ఇది క్లాసిక్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లతో వస్తోంది. అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, షియోమి రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా సెప్టెంబర్ 9 సాయంత్రం 4 గంటల్నించి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Redmi A1 ఫీచర్లు
డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో పాటు 6.52 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లే ఉంది. ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలీయో ఏ22 ఏవోసీతో అనుసంధానితమై ఉంటుంది. 2 జీబీ ర్యామ్‌తో వస్తుంది.
Redmi A1లో ఏఐ సపోర్టెడ్ డ్యూయల్ రేర్ కెమేరా ఉంది.ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో చాట్ కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంది. Redmi A1లో 32 జీబీ స్టోరేజ్ సామర్ధ్యముంది. ఇదొక మైక్రో ఎస్‌డి కార్డ్‌తో ఉంటుంది. మరోవైపు Redmi A1..20కు పైగా భాషల్ని సపోర్ట్ చేస్తుంది. Xiaomi కంపెనీ Redmi A1 ను 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది.
Also read: Dreamfolks Share Price: లిస్టింగ్ రోజే 56 శాతం పెరుగుదలతో షేర్ మార్కెట్‌ను కుదిపిన కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook