TS GOVT:తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఎక్కడెక్కడో తెలుసా?

TS GOVT: పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా  తెలంగాణ  ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం జిల్లాల విభజన చేపట్టింది. కొత్త జిల్లాలతో పాచు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. 

Written by - Srisailam | Last Updated : Jul 23, 2022, 03:37 PM IST
TS GOVT:తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఎక్కడెక్కడో తెలుసా?

TS GOVT: పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా  తెలంగాణ  ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం జిల్లాల విభజన చేపట్టింది. కొత్త జిల్లాలతో పాచు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. మొదట 31 జిల్లాలను ఏర్పాటు చేయగా.. తర్వాత నారాయణ పేట, ములుగు జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. సిఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా ఏర్పడిన మండలాలు ఇవే.. 

నారాయణ పేట జిల్లా  రెవిన్యూ డివిజన్ పరిధిలో గుండుమల్, కొత్తపల్లె మండలాలు
వికారాబాద్ జిల్లా తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్
మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల 
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్ , డొంకేశ్వర్ మండలాలు
నిజామాబాద్ జిల్లా బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని సాలూర
మహబూబాబాద్ జిల్లా మహబూబా బాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సీరోల్
నల్లగొండ జిల్లా నల్గొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో గట్టుప్పల్
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాం పేట్
కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో  డోంగ్లి 
జగిత్యాల జిల్లా జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో ఎండపల్లి
జగిత్యాల జిల్లా  కోరుట్ల డివిజన్ పరిధిలో  భీమారం 

Also Read: Batasingaram Market: రైతన్నకు తీరని నష్టం.. బాటసింగారం మార్కెట్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన టన్నులకొద్ది పండ్లు...

Also Read: Srisailam Dam:జూలైలోనే నిండిన శ్రీశైలం డ్యాం.. ఇవాళ గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News