TS Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజూకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,047 పాజిటివ్ కేసులు (Corona cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,057కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1174 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కొవిడ్ టీకాల (Vacciantion) పంపిణీ చేశారు.
Also Read: Telangana Holidays: తెలంగాణలో స్కూల్స్ సెలవులు పొడిగింపు, ఎప్పటివరకంటే..
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. దేశంలో కొత్తగా 2,71,202 కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్‌తో మరో 314 మంది మరణించారు. 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28.17 శాతం మేర పెరిగింది. విటీ రేటు ఇవాళ 16.28 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 42,462 కేసులు నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook