తెలంగాణలో వరుసగా రెండో రోజు పెరిగిన కరోనా కేసులు..

కరోనా మహమ్మారి విజృంభణ తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతోంది. కాగా ఆదివారం కొత్తగా మరో 33 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 26 కరోనా కేసులు

Last Updated : May 10, 2020, 09:23 PM IST
తెలంగాణలో వరుసగా రెండో రోజు పెరిగిన కరోనా కేసులు..

హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతోంది. కాగా ఆదివారం కొత్తగా మరో 33 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 26 కరోనా కేసులు నమోదవగా.. ఏడుగురు వలసకూలీలకు కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి మొత్తం 751మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 415 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

Also Read: ప్రతిపక్షాలను తూర్పారబట్టిన కేజ్రీవాల్..

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో పంటలకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు కలిగేలా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేక మార్లు చర్చించారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించానే విషయాలపై అధ్యయనం జరిగింది. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా వ్యవసాయాధికారులు, మండల వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News