ప్రతిపక్షాలను తూర్పారబట్టిన కేజ్రీవాల్..

కరోనా మహమ్మరిని కట్టడి చేసే పోరాటంలో ముందంజలో ఉన్నవారి కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా

Last Updated : May 10, 2020, 07:12 PM IST
ప్రతిపక్షాలను తూర్పారబట్టిన కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరిని కట్టడి చేసే పోరాటంలో ముందంజలో ఉన్నవారి కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా ఉపాధ్యాయులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని వారిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్ళను ఏర్పాటు చేశామని, అంతేకాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. కాగా పదే పదే ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొడుతు.. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ఆర్మీ, ఐటీబీపీ బలగాలను ఆందోళన పరుస్తుండగా ఇదే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుందని, ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95 శాతం మందికి కరోనా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

బిఎస్‌ఎఫ్ జవాన్లలో నేడు 35 మందికి కరోనా వైరస్ సోకగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 250కు చేరుకుంది. భారత సైనికులలో కరోనా బాధితులు సంఖ్య 500 వరకు చేరుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా బాధితులు సంఖ్య 6923కు చేరుకోగా 73 మంది చనిపోయారు. మొత్తం దేశవ్యాప్తంగా  కరోనా వైరస్ 63,400 మందికి వ్యాపించగా 2019 మంది చనిపోయారు. కరోనా బారి నుండి ఇప్పటివరకు 19,421 మంది కోలుకోగా 41866 మంది ఆక్టివ్ కేసులుగా పరిగణింపబడుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News