కేసీఆర్ కేబినెట్: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు

రాష్ట్ర మంత్రులుగా ప్రయాణస్వీకారం చేసిన 10 మంది కొత్త మంత్రులకు సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు

Last Updated : Feb 20, 2019, 10:48 AM IST
కేసీఆర్ కేబినెట్: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు

హైదరాబాద్‌: కొత్త మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. గతంలో ఆర్దిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటలకు వైద్య ఆరోగ్యశాఖ కేటాయించారు. నిరంజన్‌రెడ్డికి ఆర్థిక శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ  ఆశాఖను ఎవరికీ కేటాయించలేదు. ప్రస్తుతం ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు సీఎం వద్దే  ఉంచుకున్నారు. కేసీఆర్ తో పాటు ప్రమాణస్వీకారం చేసిన మహమూద్ అలీ హోంశాఖ, జైళ్లు, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే గతంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి ప్రస్తుతం విద్యాశాఖను కేటాయించారు. తెలంగాణ మంత్రులు వారికి కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే...

ఈటల రాజేందర్‌                          : వైద్య ఆరోగ్యశాఖ
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి                  : వ్యవసాయశాఖ
గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి                  : విద్యాశాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావు                  : పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ 
కొప్పుల ఈశ్వర్‌                               : సంక్షేమశాఖ
చామకూర మల్లారెడ్డి                       : కార్మిక శాఖ, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి 
వేముల ప్రశాంత్‌రెడ్డి                      : రవాణా, రహదారులు, భవనాలశాఖ
 అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి                 : న్యాయ, దేవాదాయ, అటవీ పర్యాటక శాఖ
శ్రీనివాస్‌గౌడ్‌                                    : ఎక్సైజ్‌శాఖ, క్రీడలు  పర్యాటకశాఖ
తలసాని శ్రీనివాస్‌యాదవ్              : పశుసంవర్థకశాఖ

ఎన్నికల తర్వాత మరో విస్తరణ

సోమవారం రాజ్‌భవన్‌లో కేటీఆర్ ప్రతిపాదించిన అభ్యర్ధులను గవర్నర్ నరసింహన్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. తొలివిడతలో 10 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీని కలుపుకుంటే మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కి చేరింది. వాస్తవానికి తెలంగాణ కేబినెట్‌లో 16మందికి చోటు కల్పించే వెసులుబాటు ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు సమాచారం.

Trending News