Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్‌ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 04:50 PM IST
Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

Amit Shah: సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణలో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన నాలుగు సీట్లను డబుల్‌ చేసుకోవాలనే ప్రణాళికలో భాగంగా కమల దళం భారీ వ్యూహం రచించిది. ఆ క్రమంలోనే అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్‌ షా పర్యటించాల్సి ఉంది. కానీ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

బిహార్‌లో జేడీయూ అధినేత, అక్కడి సీఎం నితీశ్‌ కుమార్‌ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉండడంతో అమిత్‌ షా ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏ క్షణామైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అందుబాటులో ఉండేలా అమిత్‌ షా ఢిల్లీలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

'కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈనెల 28న జరుగాల్సిన మూడు జిల్లాల పర్యటన చేపట్టాల్సి ఉంది. అత్యవసర కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉండడంతో క్లస్టర్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. తదుపరి సమావేశ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం' అని బండి సంజయ్‌ తెలిపారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ భారీ ప్రణాళిక రచించింది. లోక్‌సభ స్థానాలను 143 క్లస్టర్స్‌గా విభజించగా.. వాటిలో తెలంగాణలోని 17 నియోజకవర్గాలను 5 క్లస్టర్స్‌గా విభజన చేసింది. దేశంలోనే మొదటి క్లస్టర్‌ సమావేశం రేపు జరుగాల్సి ఉంది. మూడు జిల్లాల్లో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. ఈ పర్యటన రద్దవడంతో తదుపరి సమావేశాలు ఎప్పుడు ఉంటాయో తెలియడం లేదు.

పర్యటన వాయిదా పడినా వ్యూహం అమలు
గత ఎన్నికల్లో పార్టీ ఊహించని రీతిలో నాలుగు స్థానాలను సొంతం చేసుకుంది. ఈసారి డబుల్‌ కావాలని కమల దళం భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎనిమిది స్థానాలు ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గాలపై కూడా ప్రధాన దృష్టి సారించింది. అసెంబ్లీ ఫలితాలను పక్కనపెట్టి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలు ప్రతిఫలించవని.. జాతీయ ప్రాధాన్యాలు ప్రజలు గమనిస్తారని ఆ పార్టీలో చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, అయోధ్య ఆలయం ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు తీసుకొస్తుందని పార్టీ అధిష్టానం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. తెలంగాణలో కూడా వాటినే అస్త్రాలుగా చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. అందులోనే భాగంగా అమిత్‌ షా పర్యటనను నిర్ణయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడినా కూడా పార్టీ వ్యూహం మాత్రం అమలు కానుంది.
Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం

Also Read: KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News