పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి

తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు యాంకర్ రవి. తనతో పాటు మరికొందరి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Last Updated : Feb 10, 2020, 09:15 AM IST
పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి

హైదరాబాద్: తనను ఓ వ్యక్తి మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు ‘పటాస్’ యాంకర్ రవి. ఎలాగైనా పరిష్కారం చూపించాలంటూ మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. ఈ వివరాలిలా ఉన్నాయి.. సినీ ఇండస్ట్రీకి చెందిన సందీప్ అనే వ్యక్తి యాంకర్ రవి దగ్గర రూ.45 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. గతంలో వచ్చిన ‘ఇది మా ప్రేమకథ’ సినిమాకు సందీప్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కష్టాలు మొదలయ్యాయి.

Also Read: సింగర్ చిన్మయికి షాక్.. నామినేషన్ తిరస్కరణ!

తీసుకున్న డబ్బులు సందీప్ తిరిగి చెల్లించకపోవడం, తనకు సమాధానం కూడా ఇవ్వడంతో రవి ఆందోళనకు గురయ్యాడు. ఇక లాభం లేదనుకుని యాంకర్ రవి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. సినిమా కోసం తన వద్ద తీసుకున్న డబ్బులు కొంత తిరిగి ఇచ్చాడని, మిగతా డబ్బు చెల్లించడం లేదని సందీప్‌పై ఫిర్యాదు చేశాడు. డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకు గుర్తుతెలియని వ్యక్తులను పంపి తనను బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో రవి పేర్కొన్నాడు. తనతో పాటు మరికొందరు వ్యక్తుల వద్ద కూడా అప్పుతీసుకుని మోసం చేశాడని ఆరోపించాడు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News