AP & Telagana SSC Exams: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. రేపట్నించి రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో రేపు అంటే మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2, 676 ఛీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లోకి 5 నిమిషాల ఆలస్యం వరకూ ప్రవేశం కల్పించనున్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని విద్యాశాఖ హెచ్చరించింది. మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని హెచ్చరించింది. పరీక్ష సమయం ముగిసిన తరువాతే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది.
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చ్ 18 సెకండ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ లేదా ఉర్దూ
మార్చ్ 19 సెకండ్ లాంగ్వేజ్ తెలుగు
మార్చ్ 21 ఇంగ్లీషు
మార్చ్ 23 మేథమేటిక్స్
మార్చ్ 26 సైన్స్ 1
మార్చ్ 28 సైన్స్ 2
మార్చ్ 30 సోషల్ సైన్సెస్
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు కూడా మార్చ్ 18 నుంచే ప్రారంభం కానున్నాయి. మార్చ్ 30 తేదీ వరకూ జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలమంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. గత ఏడాది నిర్వహించినట్టే పక్కాగా నిర్వహించనున్నారు. ప్రతి పరీక్ష పత్రంపై ప్రత్యేక స్కానర్ కోడ్ ఉంటుంది. ఒకవేళ పేపర్ లీక్ అయితే ఎక్కడ్నించి, ఏ రూమ్ నుంచి లీక్ అయిందో తేలిపోతుంది.
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చ్ 18న ఫస్ట్ లాంగ్వేజ్
మార్చ్ 19న సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 20న ఇంగ్లీషు
మార్చ్ 22న మేథమేటిక్స్
మార్చ్ 23 ఫిజికల్స్ సైన్స్
మార్చ్ 26 బయోలజీ
మార్చ్ 27 సోషల్ స్డడీస్
మార్చ్ 28 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2( కాంపోజిట్ కోర్సు)
మార్చ్ 30 ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2
Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook