Pochamma Temple Issue: హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వారం క్రితం ఎయిర్ పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాలపై దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ దాడి మరవకముందే రెండు రోజుల క్రితం సిద్దాంతికట్ట మైసమ్మ త్రిశూలం ద్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామం పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లి కను గుడ్లను తొలగించి విగ్రహం వస్త్రాలను తీసి ఆలయం ముందు వేశారు దుండగులు. గమనించిన స్థానికులు ఆలయానికి వస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. అయితే ఓ అనుమనితున్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
పోచమ్మ ఆలయానికి చేరుకున్న పోలీసులు అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి వస్త్రాలు తీస్తున్నప్పుడు దాదాపు పదిమంది నిందితులు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తాము రావడం చూసి మిగతా తొమ్మిది మంది అక్కడి నుండి పరారీ అయ్యారని అంటున్నారు.
దేవాలయాలపై రోజుకు ఏదో ఒకచోట దాడులు జరగడంపై హిందూ సంఘాలు పోలీసులపై భగ్గుమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే ఏ ఒక్క హిందూ దేవాలయం మిగలదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డిసిపి రాజేష్. ఎసిపి శ్రీనివాస్ పరిశీలించారు. గుడి వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు తెలంగాణలో ప్రభుత్వంతో పాటు పోలీస్ వ్యవస్థ నిద్ర పోతుందని దుయ్యపట్టారు. తెలంగాణలోని ఇంటెలిజెన్స్ దాడులు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.