హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వారం క్రితం ఎయిర్ పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాలపై దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ దాడి మరవకముందే రెండు రోజుల క్రితం సిద్దాంతికట్ట మైసమ్మ త్రిశూలం ద్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామం పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లి కను గుడ్లను తొలగించి విగ్రహం వస్త్రాలను తీసి ఆలయం ముందు వేశారు దుండగులు. గమనించిన స్థానికులు ఆలయానికి వస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. అయితే ఓ అనుమనితున్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
Pochamma Temple Incident: ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పోచమ్మ ఆలయం ఘటన, ఆ తర్వాత శంషాబాద్ ఆలయ ఘటన మరవక ముందే మరో ఆలయంపై ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఘటనపై హిందూ సంఘాలు .. ప్రభుత్వ నిఘా వైఫల్యంతో పాటు పోలీసులు అలసత్వంపై మండిపడుతున్నారు.
Shamshabad Hanuman Temple: శంషాబాద్ హనుమాన్ టెంపుల్ లోని నవ గ్రహా విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు దాడిచేసినట్లు తెలుస్తొంది. దీంతో ఒక్కసారిగా స్థానికులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మళ్లీ హిందుదేవతలపై దాడుల అంశం మళ్లీ వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.