BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..

BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2024, 08:58 AM IST
BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి  ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..

BJP Telangana Manifesto 2024: 2024లో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికీ సంకల్ప పత్ర పేరుతో తన మేనిఫోస్టోను తయారు చేశారు.  ఇందులో 14 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రంలో సంకల్ప పత్ర రూపకల్పనలో రాజ్‌నాథ్ సింగ్ సహా 27 సభ్యుల కమిటీ మేనిఫేస్టో ఒక రూపమిచ్చారు. ముఖ్యంగా 70 యేళ్లలో కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను గత పదేళ్లుగా మోదీ సర్కార్ సరిదిద్దుతోంది. దేశంలో ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి మోదీ గ్యారంటీతో ముందుకు వెళ్తామన్నారు.

ఉగ్రవాదం, లెఫ్ట్ తీవ్రవాదాన్ని కేంద్రం ఉక్కు పాదంతో వ్యవహరించంన్నారు. దేశ భద్రతతో పాటు అంతర్గత భద్రతపై రాజీలేని పోరాటాన్ని కేంద్రంలోని ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. అంతేకాదు ఇప్పటికే బీజేపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించిన చాలా అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నెరవేర్చిన చరిత్ర ఉంది. అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటివి చేసి చూపించిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. వచ్చే ఐదేళ్లలో దేశ మంతటా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి (జమిలి) ఎన్నికలను సాకారం చేస్తామన్నారు. అలాగే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ఇతర నేతలు పాల్గొన్నారు.

దేశంలో ఇప్పటికే మూడు కోట్ల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసారమన్నారు. మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాదు దేశ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, సొంత ఇల్లు.. మోదీ ఇచ్చే గ్యారంటీలను చెప్పారు.
అంతేకాదు పేదలకు నెలకు 5 కిలోల బియ్యం.. తాగునీరు, ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకం అమలు సహా అనేక కార్యక్రమాలను బీజేపీ అమలు చేస్తుందన్నారు. పేపర్ లీక్‌లు అరికట్టేందకు కఠినమైన చట్టాలను తీసుకు వస్తామన్నారు. నాణ్యమైన చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపచేయనున్నట్టు తెలిపారు. పాడిపంటల రక్షణకు ప్రత్యేక పథకం తీసుకొచ్చామన్నారు. గిరిజనులకు సంబంధించిన ఆచార వ్యవహారాలను కాపాడేందుకు ప్రత్యేక కార్యా చరణ పథకం అమలు చేస్తామన్నారు.

గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్ హాస్పిటల్స్, 315 వైద్య కాలేజీలు.. 390 విశ్వ విద్యాలయాలు..ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రైళ్ల రీ మోడలింగ్‌, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతిపై ఈ సంకల్ప పత్రంలో వివరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు పూర్తిగా అమలు అయ్యేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.

Also Read: Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News