BANDI SANJAY FIRE ON KCR : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పధాధికారుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సంఘటన సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టారు.
బీజేపీ తెలంగాణ పధాధికారుల సమావేశంలో బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై ఎక్కడికక్కడ కార్యకర్తలు, ప్రజలు ఎండగట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలే లేనట్లుగా, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వక్రభాష్యం చెబుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా కంటక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారని, అయితే అలాంటి వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ, పంజాబ్ వెళ్లి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నరని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అబద్దాలను నిజాలుగా వల్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు అసలు ఆత్మహత్యలే చేసుకోవడం లేదని, రాష్ట్రమంతా ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉందన్నట్లుగా కేసీఆర్ వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, రాష్ట్ర నాయకులంతా ఎక్కడికక్కడ సీఎం తీరును ఎండగడుతూ... ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ, రాహుల్ గాంధీ సభ, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలను చూసిన ప్రజలు... ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారని తెలిపారు. ఇటీవల మూడు ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే ఇదే విషయం వెల్లడైందన్నారు. ఆ నివేదికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉందని, బీజేపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగినట్లు తేలిందని అన్నారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో పార్టీ నేతలంతా తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు మరింత యాక్టివ్‌గా పనిచేయాలని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈనెలాఖరు నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 30 నుండి జూన్ 14 వరకు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు సుపరిపాలనపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గడప గడపకూ వెళ్లి మోదీ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలతోపాటు అవినీతి, అక్రమాలకు తావులేకుండా సుపరిపాలన అందించిన తీరు, భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని వివరించాలని కోరారు. పార్టీ నేతలందరి సహకారంతో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందని పేర్కొన్న బండి సంజయ్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా జూన్ 23 నుండి రాష్ట్రంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాకంటక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. ఈ క్రమంలో ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నారని, లాఠీ దెబ్బలు తింటూ జైళ్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఇంకెంత కాలం కష్టాలు భరించాలని... మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్‌లో ఒక కార్యకర్తపై ఒకే సంఘటనలో 32 కేసులు నమోదు చేశారంటే... టీఆర్ఎస్ కక్షపూరిత వ్యవహరిస్తున్నరడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.
వాళంతా ఏమీ పదవులు ఆశించడం లేదని.. అధికారంలోకి వస్తే వాళ్లపై కేసులు కొట్టేయాలని మాత్రమే కోరుకుంటున్నారని సంజయ్ తెలిపారు. వాళ్లు ఇంకెన్నాళ్లు కష్టాలు భరించాలని... కచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలని.. అందుకోసం మనమంతా పూర్తి సమయం కష్టపడదామని.. కార్యకర్తలను కాపాడుకుందామని సంజయ్ పిలుపునిచ్చారు.
Also Read - CM Jagan Tour: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం..దావోస్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం..!
Also Read - Konaseema: కోనసీమ జిల్లాలో హైఅలర్ట్..మిన్నంటిన ఆందోళనలు..భద్రత రెట్టింపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
BANDI SANJAY FIRE ON KCR : 'కేసీఆర్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తాం'
కేసీఆర్‌ది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర-సంజయ్
తెలంగాణలో ఆత్మహత్యలే లేవని ప్రచారం-సంజయ్
కేసీఆర్‌ను జనం అసహ్యించుకుంటున్నారు-సంజయ్