Mahavir chakra award: మహావీరచక్ర అవార్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కల్నల్ సంతోష్ బాబు తండ్రి

Mahavir chakra award: లడాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహా వీరచక్ర పురస్కారం లభించింది. అయితే ఈ అవార్డుపై ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనమవుతున్నాయి.

Last Updated : Jan 26, 2021, 11:15 PM IST
  • మహావీర చక్ర అవార్డుపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి సంచలన వ్యాఖ్యలు
  • మహావీర చక్ర అవార్డు పట్ల అంత సంతృప్తిగా లేదని చెప్పిన సంతోష్ బాబు తండ్రి ఉపేంద్ర
  • పరమవీర చక్ర అవార్డుతో సత్కరించుంటే బాగుండేది
Mahavir chakra award: మహావీరచక్ర అవార్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కల్నల్ సంతోష్ బాబు తండ్రి

Mahavir chakra award: లడాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహా వీరచక్ర పురస్కారం లభించింది. అయితే ఈ అవార్డుపై ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనమవుతున్నాయి..

ఇండో చైనా సరిహద్దు ( Indo China Border ) ని గాల్వాన్ లోయలో ( Galwan Valley ) భారత, చైనా సైనికుల మధ్య  2019 జూన్ 15న జరిగిన ఘర్షణ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘర్షణలో 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు ( Colonel Santhosh Babu ) వీరమరణం పొందారు. ఈ ఘర్షణలో మరో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. దేశ గణతంత్ర దినోత్సవాల్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి గుర్తుగా మహా వీరచక్ర అవార్డు ( Mahavir Chakra Award ) తో సత్కరించింది. ఈ సందర్భంగా దివంగత కల్నల్ సంతోష్ బాబు తండ్రి ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వీరమరణం పొందిన తన కుమారుడు కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రకటించడం పట్ల నూటికి నూరుశాతం సంతృప్తి చెందడం లేదని చెప్పారు. మిలిటరీలో అత్యున్నత గౌరవ పురస్కారమైన పరమ వీరచక్ర ( Paramvir Chakra ) తో గౌరవించాలని ఉపేంద్ర అభిప్రాయపడ్డారు. తనకు అసంతృప్తిగా లేదు కానీ..మహావీర చక్ర అవార్డుతో పూర్తి సంతృప్తి చెందలేదని చెప్పారు. మరింత మెరుగ్గా  తన కుమారుడిని గౌరవించడానికి ఆస్కారముందని వివరించారు. తన కుమారుడు చూపిన శౌర్య పరాక్రమాలు సైనిక బలగాల్లో పనిచేస్తున్నవారికి స్ఫూర్తినిచ్చాయన్నారు. 

ఇండియా చైనా దేశాల మధ్య పలు దశాబ్దాలుగా జరుగుతున్న సైనిక ఘర్షణల్లో గాల్వాన్ ఘర్షణ ( Galwan Dispute ) ఒకటిగా నిలిచింది. గాల్వాన్ లోయలోని వాతావరణ పరిస్థితులతో తలెత్తిన సవాళ్లను అధిగమించి మరీ..చైనా బలగాలతో తన కుమారుడు పోరాడాడని ఉపేంద్ర గుర్తు తెచ్చుకున్నారు. 

Also read: Traffic Restrictions: నేడు Hyderabad‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News