TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?

Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 1, 2024, 01:29 PM IST
  • జూన్ 2 తెలంగాణ ఆవిర్భావానికి భారీగా ఏర్పాట్లు..
  • ఢిల్లీ నుంచి ఊహించని ట్విస్ట్..
TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?

Sonia Gandhi not attending ts formation celebrations:  సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఎన్నికల కోడ్ ఉన్న కూడా ఈసీ నుంచి ప్రత్యేంగా పర్మిషన్ తీసుకున్నారు.  గతంలోని ప్రభుత్వం చేయనంతగా, తెలంగాణ ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించాలని సీఎం రేవంత్ భావించారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను .. ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణను ఇచ్చిన తల్లిగా.. రావాల్సిందిగా రేవంత్ కోరినట్లు సమాచారం. అనేక మంది కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ వేడుకలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ ప్రత్యేకంగా కోరారు.  సోనియా గాంధీ సైతం.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు హజరువుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తొలుత తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు హజరువుతారన్న సోనియా గాంధీ.. శనివారం నాడు మాత్రం తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే తన పర్కటనను క్యాన్షిల్ చేసుకున్నట్లు సమాచారం. తీవ్రమైన ఎండల వల్ల సోనియా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.  అయిన కూడా.. సోనియా గాంధీ రాలేకపోయినప్పటికి వీడియో ద్వారా సందేశంను ప్రజలకు అందించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

సోనియా పర్యటన రద్దు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ఒకింత నిరాశ చెందినట్లు తెలుస్తోంది.  సీఎం రేవంత్ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తెలంగాణ రాష్ట్రగీతం, ఎంబ్లమ్ లపై అనేక మార్పులు తీసుకొచ్చారు. జూన్ 2 న తెలంగాణ రాష్ట్రగీతం ఆవిష్కరణ చేయనున్నారు. ఇక లోగో విషయంలో కాస్తంత చర్చలు జరిపి తుదినిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..  తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క శనివారం రాజ్ భవన్ కు వెళ్లారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈనేపథ్యంలో ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను సీఎం, డిప్యూటీ సీఎం గవర్నర్ సీపీ రాధ కృష్ణన్  కు అందజేశారు. ప్రత్యేకంగా శాలువాను కప్పి, పుష్పగుచ్ఛం సైతం అందజేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్  చేస్తుంది.

ఇప్పటికే సీఎం రేవంత్.. ఈసీ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. జూన్ 2 న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, ఇతర ఉత్సవాలకు ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు జరిగిపోయాయి. గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపం వద్ద మొదటగా సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. అదే విధంగా సాయంత్రం ట్యాంక్ మీద  లెజర్ షో ఉండనుంది. దీనితో పాటు కవులు, కళాకారులతో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ తన ప్రత్యేక సలహాదారుతో ఆహ్వనం అందజేయాలని చెప్పిన విషయం తెలిసిందే. 

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x