రాజమౌళి RRRను బీట్ చేసే మరో RRRను తెరపైకి తెచ్చిన విజయశాంతి

                  

Updated: Feb 11, 2019, 12:15 PM IST
రాజమౌళి RRRను బీట్ చేసే మరో RRRను తెరపైకి తెచ్చిన విజయశాంతి

రాజమౌళి డైరెక్షన్ లో తెరపైకి వస్తున్న RRR గురించి జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కలెక్షన్ల పరంగా ఇది బాహుబలి మూవీని బీట్ చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సందర్భంలో మరో RRR తెరపైకి వచ్చింది. ఇది రాజ్ మౌళి RRRను బీట్ చేస్తుందని నటి కాంగ్రెస్ మహిళ నేత విజయశాంతి పేర్కొన్నారు..ఈ RRR గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయశాంతి ..తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ (RRR) ను టార్గెట్ చేస్తూ వ్యగ్యాంస్త్రాలు సంధించారు. కలెక్షన్ల పరంగా కేసీఆర్ చేపట్టనున్న RRR ప్రాజెక్టు.. రాజ్ మౌళి RRR ప్రాజెక్టును బీట్ చేస్తుందని విమర్శించారు.

ఈ సందర్భంగా విజయశాంతి ఏమన్నారంటే... రీజనల్ రింగ్ రోడ్  (RRR) కు.. తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి ఒక లింక్ ఉందని తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది.

 "కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే... తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి"

దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది" అని విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.