Toukde Cyclone: అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను హెచ్చరిక

Toukde Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుపానుగా మారింది. తుపాను ప్రభావంంతో రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2021, 10:21 AM IST
Toukde Cyclone: అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను హెచ్చరిక

Toukde Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుపానుగా మారింది. తుపాను ప్రభావంంతో రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.

అరేబియా సముద్రం(Arabian Sea)లో త్వరలో తీవ్ర తుపాను ఏర్పడనుంది. ఈ తుపానుకు తౌక్డే అని నామకరణం చేశారు. తొలుత ఇది అల్పపీడనంగా ఏర్పడింది. తరువాత వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ గుజరాత్ తీరప్రాంతానికి 920  కిలోమీటర్లదూరంలో కేంద్రీకృతమైఉన్న వాయుగుండం మరింతగా బలపడి..మే 16 నాటికి తుపానుగా మారనుంది. అనంతరం మరింతగా బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

తుపానుగా మారనుండటంతో తౌక్డేగా (Toukde Cyclone) నామకరణం చేశారు. మే నెల 18 నాటికి గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్డే తుపాన్ ప్రభావంతో కేరళలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. ప్రస్తుతం లక్షద్వీప్ వద్ద ఈ అల్పపీడనం కొనసాగుతోంది. మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా ( Severe Cyclone) మారునుంది. ఆ తరువాత అతి తీవ్ర తుపానుగా మారనుందని..గుజరాత్ పరిసరాల్లో తీరం దాటనుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల రాకకు తుపాను శుభసంకేతమని వాతావరణ శాఖ (IMD) చెబుతోంది.

Also read: Goa Danger Bells: గోవాలో కొనసాగుతున్న మరణ మృదంగం, ఆక్సిజన్ కొరతే కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News