Raghunandan Rao Latter To CM KCR: సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు లేఖ రాశారు. దుబ్బాక నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేను అని.. కానీ జిల్లా ఇంఛార్జి మంత్రి అన్నీ తానై నిధులు కేటాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ఒకే నీతి ఉంటుందని.. ఎలాంటి వివక్ష లేని ప్రభుత్వం ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులను కూడా తెలంగాణ ప్రభుత్వం కాలరాయలేదన్నారు.
''దుబ్బాక నియోజకవర్గం తెలంగాణలో మీ సొంత జిల్లాలో ఉన్న విషయం తమరికి తెలియనిది కాదు. దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వారి అవసరాలను, సమస్యలను తీర్చగలనని నమ్మకంతో నన్ను గెలిపించగా.. రాజ్యాంగం ప్రకారం నేను దుబ్బాక శాసననభకు ప్రతినిధిగా ఉన్నానన్న విషయం మరొక్కసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నా.
ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గం అవసరాల కోసం నియోజకవర్గ అభివృద్ది నిధులను ప్రతీ శాసనసభ్యుడికి కూడా కేటాయిస్తోంది. ఆ నిధులను ఆయా నియోజకవర్గ శాసనసభ్యులకు అధికారం ఇచ్చి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిధులు కేటాయింపులు చేసుకునే అధికారం ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వ విధానం ప్రభుత్వాధినేతగా తమరికి తెలియదని నేననుకోను. తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏపార్టీ వారైనా కూడా వారికి సమాన హక్కులు ఉంటాయి.
కానీ ప్రజల మద్దతుతో గెలిచిన నాపై మాత్రం వివక్ష చూపిస్తోన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నా. ప్రజా ప్రయోజనార్థం అక్కడి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కేటాయించే హక్కు, బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేకే ఉంటుంది. కానీ దుబ్బాకలో మాత్రం పూర్తిగా గెలిచిన సభ్యుడిని అగౌరవ పరుస్తూ.. వివక్ష చూపిస్తూ దుబ్బాకలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కేటాయించే అవకాశం నాకు లేకుండా జిల్లా ఇంఛార్జి మంత్రి గారు పూర్తి ఏకపక్షంగా నిధులను తన అధికారాలతో కేటాయించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఇది తెలంగాణకు కానీ తమ ప్రభుత్వానికి ఎలాంటి శోభనీయకపోగా ప్రజల మధ్యన దోషిగా నిలబడాల్సి వస్తుందని చెప్పడానికి కూడా సంకోచించడం లేదు..'' అని రఘునందన్ రావు లేఖలో పేర్కొన్నారు.
Also Read: Ravi Shastri: రోహిత్ శర్మ కంటే హార్థిక్ పాండ్యా టీమ్ బెటర్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Also Read: Shraddha Murder Case: వెలుగులోకి శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్ చాట్.. చివరి మెసేజ్ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి