KTR Arrest: ఫార్ములా ఈ రేసు కేసు విచారణను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి మరికాసేపట్లో ఈడీ ముందుకు రానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరుకానున్నారు.
ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా.
ఈ కేసులో డిసెంబర్ 19న యాంటీ కరెప్షన్ బ్యూరో FIR నమోదు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అప్పుడు మున్సిపల్ కార్పోరేషన్ మంత్రిగా కేటీఆర్ సంతకం చేసినందకు విదేశీ సంస్థకు HMDA నిధులు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి లాభం చేకూర్చలేదనేది కేటీఆర్ వాదన. మరి ఈ కేసులో ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.